Arjun Suravaram
Rajya Sabha: లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అంతకంటే ముందు రాజ్యసభలోని కొన్ని స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
Rajya Sabha: లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అంతకంటే ముందు రాజ్యసభలోని కొన్ని స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
Arjun Suravaram
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 15, అలానే ఫిబ్రవరి 16 నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 20వ తేదీ ఉపసంహరణకు చివరి గడువు. 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్ర 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక ఏపీ నుంచి మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి. వారిలో సీఎం రమేశ్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ ఉన్నారు. అలానే తెలంగాణ నుంచి కూడా మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వద్దిరాజు రవిచంద్ర, బడులు లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ లు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్ 6, మహారాష్ట్రలో 6, పశ్చిమ బెంగాల్ 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4 కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్ లో మూడే చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 4వ తేదీతో 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.