iDreamPost

ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్‌లు

విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు... విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వారికి ఉచితంగా ట్యాబ్ లను అందించనున్నది.

విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు... విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వారికి ఉచితంగా ట్యాబ్ లను అందించనున్నది.

ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్‌లు

ప్రభుత్వాలు విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషా చేస్తున్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. పాఠశాలల్లో ఆధునిక వసతులతో విద్యను అందిస్తూ అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాయి. అదే విధంగా విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు స్కాలర్ షాప్స్ అందిస్తున్నాయి. అయితే కరోనా అనంతరం డిజిటల్ బోధనకు ప్రాధాన్యత పెరిగింది. మరి సొంతంగా ట్యాబ్ లను సమకూర్చుకోవడం విద్యార్థులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విద్యార్థులందరికీ ఫ్రీగా ట్యాబ్ లను ఇవ్వనున్నది ప్రభుత్వం.

రాను రాను బోధన విధానమే మారిపోతున్నది. కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ ద్వారా క్లాస్ లు చెప్తున్నాయి. కాగా డిజిటల్ క్లాస్ ల నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్తను అందించింది. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేసే పథకానికి రాజస్థాన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 8, 9, 10వ తరగతులలో అత్యధిక ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. 75 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ట్యాబ్‌లను అందిస్తున్నది రాజస్థాన్ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు.

8 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 55727 మంది విద్యార్థులకు ట్యాబ్‌లతో పాటు రోజుకు 1జీబీ డేటాతో సిమ్ కార్డులను కూడా అందజేయనుంది అక్కడి ప్రభుత్వం. రూ.18 కోట్లతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. జూన్ నెల చివరికి నాటికి ఈ సిమ్‌కార్డ్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత స్థితిలో రాణిస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో మంది పేద విద్యార్థులకు ఈ పథకం ఉపయోగకరంగా మారనుంది. కార్పోరేట్ స్కూల్స్ ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు ట్యాబ్ లను అందిస్తే.. అక్షరాస్యతా శాతం పెరిగి విద్యావ్యవస్థలో నూతన ఒరవడిని సృష్టించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి