లోయర్ బెర్త్ కావాలా? కొత్త నిబంధనలు వచ్చాయి..ఏంటో తెలుసా?

Indian Railways: ప్రపంచంలో అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత రైల్వే ఒకటి. తక్కువ ధర.. సురక్షితమైన ప్రయాణం.. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

Indian Railways: ప్రపంచంలో అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత రైల్వే ఒకటి. తక్కువ ధర.. సురక్షితమైన ప్రయాణం.. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

దేశంలో ప్రతిరోజు భారతీయ రైల్వేల ద్వరా లక్షల మంది ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో లేని సదుపాయం ట్రైన్ లో ఉంటుంది.. అందుకే సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాద ఇతర ప్రైవేట్ వాహనాలతో పోల్చితే టికెట్ ధర కూడా తక్కువే. అందుకే పిల్లల నుంచి వృద్దుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి సుముఖత చూపిస్తుంటారు. రైల్వే సీనియర్ సిటిజన్లకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తుంది. రైల్వేలో లోయర్ బెర్త్ బుక్ కి సంబంధించి కొత్త రూల్ వచ్చింది. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు రైల్వే ప్రయాణం చేయాలంటే సీనియర్ సిటిజన్లకు ఇబ్బందులు ఉండేవి. వయసు మీద పడిన వారికి పలు రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. దీన్ని దృష్టి పెట్టుకొని సీనియర్ సిటిజన్ కోసం కుటుంబ సభ్యులు బెర్త్ బుక్ చేసినా దాన్ని పొందలేని పరిస్థితి ఉండేది. ఇకపై అలాంటి సమస్యులు లేకుండా కొత్తగా కొన్ని కొత్త నియమాలు రూపొందించింది భారత రైల్వే. దీంతో సీనియర్ సిటిజన్లు హ్యాపీగా రైలు ప్రయాణం చేయవొచ్చు. ఇకపై సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలియజేసింది.ఇటీవల తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్ల సమస్యలు ఉన్నందున లోయర్ బెర్త్ కే ప్రాధాన్యత ఇచ్చానని.. కానీ రైల్వే తనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు రైల్వే శాఖకు ట్విట్ చేశారు.

ప్రయాణికుడు పంపిన ట్వీట్ పై స్పందించిన రైల్వే.. మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసి ఉంటే సీటు ఉంటేనే మీకు అలాట్ అవుతుంది.. ఒకవేళ మీరు రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద బుక్ చేస్తే మీకు ఖచ్చితంగా లోయర్ బెర్త్ లభిస్తుంది. సీట్లు ఉన్నపుడే జనరల్ కోటా కింద బుక్ చేసిన వారికి సీట్లు కేటాయిస్తున్నామని తెలిపింది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే ప్రాతిపదికన ఉంటుంది. ఒకవేళ మీ పేరెంట్ పరిస్థితి బాగాలేకుంటే.. మీరు లోయర్ బెర్త్ కోసం టీటీఈని సంప్రదించవొచ్చు. లోయర్ బెర్త్ కోసం మాట్లాడు సమస్యను పరిష్కరించుకోవొచ్చు. లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే మీకు లభిస్తుంది అని రేల్వే తెలిపింది.

Show comments