Rahul Gandhi: చెప్పులు కుట్టే వ్యక్తికి రాహుల్ సర్ ప్రైజ్! ఏం చేశాడంటే..

చెప్పులు కుట్టే వ్యక్తికి రాహుల్ సర్ ప్రైజ్! ఏం చేశాడంటే..

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ప్రస్తుతం పార్టమెంట్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పొలిటికల్ సెక్టార్ లో దూకుడుగా వెళ్తున్నారు. వివిధ అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మాటల యుద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెప్పుల షాపు నడుపుకునే వ్యక్తికి రాహుల్ సర్ ఫ్రైజ్ చేశారు.

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ప్రస్తుతం పార్టమెంట్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పొలిటికల్ సెక్టార్ లో దూకుడుగా వెళ్తున్నారు. వివిధ అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మాటల యుద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెప్పుల షాపు నడుపుకునే వ్యక్తికి రాహుల్ సర్ ఫ్రైజ్ చేశారు.

సినీ, రాజకీయ నాయకులకు సంబంధించి ఏ చిన్న విషయం జరిగిన వెంటనే వైరల్ అవుతుంది. అంతేకాక కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు, ప్రముఖులు వారి అభిమానులకు, కార్యకర్తలకు ఇచ్చే సర్ ఫ్రైజ్ లు వైరల్ అవుతుంటాయి. తమ అభిమానులను, సామాన్యుల వద్దకు సడెన్ గా వెళ్లి ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అలాంటి అనుభవమే రాహుల్ గాంధీ నుంచి ఓ చెప్పుల షాపు ఓనర్ కి ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

కాంగ్రెస్ అగ్రనేత, ప్రస్తుతం పార్టమెంట్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పొలిటికల్ సెక్టార్ లో దూకుడుగా వెళ్తున్నారు. వివిధ అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మాటల యుద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో తరచూ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోన సుల్తాన్ పూర్ కి వెళ్లిన రాహుల్ గాంధీ ఓ చెప్పుల దుకాణం వ్యక్తిని షాకి గురిచేశారు. పరువు నష్టం కేసులో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌‌ సుల్తాన్‌‌పూర్‌‌‌‌లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఆకస్మికంగా ఓ చెప్పుల షాపును సందర్శించారు. ఆ దుకాణం నడుపుకుంటున్న రామ్ ఛేట్ వ్యక్తికి రాహుల్ సర్ ప్రైజ్ చేశారు.  ఇలా అకస్మాత్తుగా రాహుల్ గాంధీ తన వద్దకు రావడంతో ఆ వ్యక్తి నోట మాట రాలేదు. ఇక చెప్పుల షాపు వ్యక్తిని కలిసిన రాహుల్ అతనితో మాట్లాడి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

ఇక శుక్రవారం పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌‌ సుల్తాన్‌‌పూర్‌‌‌‌లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. బీజేపీ అగ్ర నేత అమిత్ షాపై  రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ 2018లో స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. దీనిపై శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మ ఈ కేసును విచారించారు. ఇరువైపుల వాదనలు విన్న తరువాత విచారణను ఆగస్టు 12కు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే తిరిగి ఢిల్లీకి వెళ్తున్న ఈ క్రమంలోనే ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

ఇది ఇలా ఉంటే.. లోక్‌‌సభ  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లోక్‌‌సభ హౌస్ కమిటీ కొత్త ఇళ్లును కేటాయించింది. ఢిల్లీలోని సునేహ్రీ బాగ్ రోడ్‌‌లోని 5వ నంబర్ బంగ్లాను రాహుల్ గాంధీ కేటాయించింది. అయితే దీనిపై రాహుల్​ అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నట్టు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. 2023లో  పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ ఎంపీగా అనర్హతకు గురైన సంగతి తెలిసింది. ఆ సమయంలో రాహుల్ కు  తుగ్లక్  రోడ్డులోని కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీ,  ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నందున తిరిగి అధికారిక బంగ్లా కేటాయించారు.

Show comments