Krishna Kowshik
వివాదాస్పద ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ కారణంగా ఆమె కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. లేని అధికారాల కోసం డిమాండ్స్, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వార్తల్లో నిలిచింది. దీంతో తల్లిదండ్రులు కూడా ఫోకస్ అయ్యారు.
వివాదాస్పద ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ కారణంగా ఆమె కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. లేని అధికారాల కోసం డిమాండ్స్, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వార్తల్లో నిలిచింది. దీంతో తల్లిదండ్రులు కూడా ఫోకస్ అయ్యారు.
Krishna Kowshik
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ ఆగ్రహానికి గురై.. ట్రాన్స్ ఫర్ పొందింది మహారాష్ట్ర ట్రైనీ ఏఏఎస్ పూజా ఖేడ్కర్. నకిలీ సర్టిఫికేట్స్ చూపించి జాబ్ పొందిందని, ఆమెకు కోట్లల్లో ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ నాన్ క్రిమిలేయర్ కింద ఐఎఎస్ కావడంపై విమర్శలు వచ్చాయి. ఈ వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఆఫీసరే కాకుండా తల్లి మనోరమ ఖేడ్కర్ కూడా ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి విదితమే. రైతులను పిస్టల్‌తో బెదిరించిన ఓ పాత వీడియో వైరల్ అయ్యింది. కూతురిపై ఆరోపణలు వస్తున్న సమయంలో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఓ భూవివాదం వ్యవహారంలో మనోరమ పిస్టల్‌తో బెదిరించింది. ఈ ఘటనపై ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై పూజా తల్లిదండ్రులు దిలీప్, మనోరమలతో పాటు ఐదుగురిపైనా పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుండి దంపతులు పరారీలో ఉన్నారు. పూజా తల్లి మనోరమను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయ్ గఢ్‌లోని ఓ హోటల్లో ఆమెను ఆరెస్టు చేశారు. పూజా తండ్రి దిలీప్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. పూణేలోని ముల్సి తహశీల్‌లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఈ భూమి విషయంలో రైతులతో గొడవపడ్డారు దంపతులు. ఈ క్రమంలో మనోరమ బౌన్సర్లను వెంటేసుకెళ్లి.. పిస్టల్‌తో రైతులను బెదిరించింది. ఈ వీడియో వైరల్ కావడంతో అక్రమంగా ఆయుధాలను వినియోగించినందుకు భారతీయ ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులో విచారణకు పిలిచానా దంపతులు రాలేదు, అలాగే మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో ఈ ఇద్దరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ దంపతులను పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మనోరమను ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. పూజా తండ్రి దిలీప్ కోసం వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగం చేసే సమయంలో రెండు సార్లు సస్పెన్షన్ కూడా అయ్యాడు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023-బ్యాచ్ IAS అధికారిణి పూజా ఖేడ్కర్ నకిలీ అంగవైకల్యాన్ని చూపించి జాబ్ పొందిందని, ప్రొబేషన్ పీరియడ్‌లో లేని అధికారులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో పూణె నుండి వాషిమ్‌కు బదిలీ అయ్యింది. ఆమె నియామకం వివాదాలకు దారినివ్వడంతో.. ఆమె ట్రైనింగ్ నిలుపుదల చేసి ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్రేషన్ కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆమె ప్రవర్తన, ఎంపిక ప్రక్రియపై విచారణకు కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.