Liquor Price: మందుబాబులకు పండగే.. భారీగా దిగిరానున్న మద్యం ధరలు!

Premium Liquor Price-Karnataka: మందుబాబులకు ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. మద్యం ధరలు భారీగా దిగి రానున్నాయి. కాకపోతే.. ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ఆ వివరాలు..

Premium Liquor Price-Karnataka: మందుబాబులకు ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. మద్యం ధరలు భారీగా దిగి రానున్నాయి. కాకపోతే.. ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ఆ వివరాలు..

మద్యం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. క్యాన్సర్‌కు అయినా చికిత్స, మందులు ఉన్నాయేమో కానీ.. డ్రింక్‌ అలవాటు మాన్పించడానికి మాత్రం ఎలాంటి చికిత్స లేదు. మన దేశంలో ప్రతి ఏటా సంభవిస్తోన్న మరణాలు, నేరాల్లో మద్యం వల్ల చోటు చేసుకునేవే అధికంగా ఉంటాయి. ఇది బహిరంగ రహస్యమే అయినా.. ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవు. గవర్నమెంట్‌కి ఆదాయం తెచ్చే ప్రధాన వనరు మద్యమే కావడంతో.. నిషేధించలేకపోతున్నాయి. పైగా ఆదాయం పెంచుకోవడం కోసం రేట్లను ఎడాపెడా పెంచుతుంటాయి. కానీ తాజాగా ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకోబోతుంది. మధ్యం ధరలను భారీగా తగ్గించనుందని వార్తలు వస్తున్నాయి.

ప్రీమియం మద్యం ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఒకేసారి 15-25 శాతం వరకు రేట్లను తగ్గించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రీమియం మద్యం కొనుగోళ్లను నివారించడం కోసమే ప్రభుత్వం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం కనక ప్రీమియం మద్యం రేటు 25 శాతం తగ్గిస్తే.. అప్పుడు రాష్ట్రంలోనే కొనుగోళ్లు పెరుగుతాయని.. దాని వల్ల ప్రభుత్వ ఖజనాకు ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక కరోనా తర్వాత రాష్ట్రంలో బీర్ల అ‍మ్మకాలు భారీగా పెరిగాయని.. గత రెండేళ్లలో ఇవి రెండింతలయ్యాయని అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలో జనాలు బీర్‌ని రీఫ్రెష్‌మెంట్‌ డ్రింక్‌గా భావిస్తున్నారని.. అందుకే దాని అమ్మకాలు విపరీతంగా పెరిగాయని అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ప్రీమియం మద్యం ధరల తగ్గింపు నిర్ణయం గత జూలై 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది.. కానీ వివిధ కారణాల వల్ల ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర బేవరేజెస్‌ కార్పోరేషన్‌తో పాటు.. మద్యం ప్రియులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అంతేకాక దీనిపై స్పష్టత లేకపోవడంతో.. చాలా డిస్టిల్లరీస్‌ ప్రీమియం మద్యం ఉత్పత్తిని నిలిపేశాయి. ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వస్తే ప్రీమియం మద్యం ధరలు తగ్గుతాయి కనుక.. ఇప్పుడు దాన్ని ఉత్పత్తి చేయడం వల్ల నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో డిస్టిల్లరీస్‌ ప్రొడక్షన్‌ నిలిపేశాయి. అలానే రిటైలర్స్‌… ప్రీమియం మద్యం స్టాక్‌ని నిల్వ ఉంచడం లేదు. ఇక ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో.. కర్ణాటకలో ప్రీమియం మద్యం కొరత ఏర్పడింది. ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం.. వీటి అమ్మకాలు పెరుగుతాయంటున్నారు. అలానే త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అధికారులు చెబుతున్నారు.

Show comments