iDreamPost
android-app
ios-app

ఆటో డ్రైవర్స్‌పై పోలీసులు ఆగ్రహం! ఏకంగా 40 మందిపై చర్యలు!

ఉద్యోగాలకు, ఇతర పనుల మీద బయటకు వెళ్లాలంటే .. బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటే ఆ వాహనాన్నే ఆశ్రయిస్తుంటారు. లేకపోతే.. ఆటోలో వెళ్లాల్సిందే. అయితే ఆటో ఎక్కితే.. మొత్తం ఫిల్ అయ్యేంత వరకు వెళ్లరు. అంతేకాకుండా..

ఉద్యోగాలకు, ఇతర పనుల మీద బయటకు వెళ్లాలంటే .. బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటే ఆ వాహనాన్నే ఆశ్రయిస్తుంటారు. లేకపోతే.. ఆటోలో వెళ్లాల్సిందే. అయితే ఆటో ఎక్కితే.. మొత్తం ఫిల్ అయ్యేంత వరకు వెళ్లరు. అంతేకాకుండా..

ఆటో డ్రైవర్స్‌పై పోలీసులు ఆగ్రహం! ఏకంగా 40 మందిపై చర్యలు!

అల్లు అర్జున్ ఓ మూవీలో చెప్పినట్లుగా యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదూ ఓ కుటుంబం రోడ్డున పడటం. అది నిజమే. ఎందుకంటే కుటుంబాన్ని పోషించే ఓ పెద్ద అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. ఆ ఫ్యామిలీకి అండగా నిలిచేవారు, ఆర్థికంగా ఆదుకునేవారు కరువౌతారు. ఎవ్వరూ సాయం చేయరు. దీంతో మరణించిన వ్యక్తి కుటుంబంలోని భార్యా, బిడ్డలు రోడ్డున పడాల్సిందే. ఇలాంటి ప్రమాదాలు ఎంతో మంది జీవితాలను చీకటిమయం చేశాయి. కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అయినా సరే త్వరగా ఇంటికి లేదా ఉద్యోగాలకు వెళ్లిపోవాలని.. భద్రతా ప్రమాణాలు పాటించకుండా వాహనాలను డ్రైవ్ చేయడం, లేదంటే ప్రయాణం చేస్తున్నారు. వీరే కాదూ.. పిల్లలతో వెళుతున్నప్పుడు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. దీంతో కుటుంబాలకు, కుటుంబాలు రోడ్డు ప్రమాదాలకు బాధితులౌతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎన్ హెచ్-19 సికింద్ర గురు కా తాల్ గురుద్వారా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రెండు కంటెనర్ల మధ్య ఆటో ఇరుక్కోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ భీతావాహన్ని చూసి ప్రజలు సైతం భయపడ్డారు. ఆ ఆటోలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, సుమారు 12 ఏళ్ల చిన్నారి ఉన్నారు. ఆటో భగవాన్ టాకీస్ నుండి సికంద్రా వైపు వెళుతుండగా.. ఆ వాహనానికి వెనుక, ముందు రెండు కంటైనర్లు నడుస్తున్నాయి. ముందు వెళుతున్న కంటైనర్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో దాని వెనుకే ఉన్న ఆటో కంటైనర్ ను గుద్దింది. వెంటనే దాని వెనుక కంటైనర్ ఆటోను బలంగా ఢీ కొట్టడంతో.. ఈ రెండు వాహనాల మధ్య ఆటో ఇరుక్కుని నుజ్జునుజ్జయ్యింది.

రెప్ప పాటులో జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణీకులంతా మరణించారు. అయితే ఇది ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో.. నిబంధనలకు విరుద్ధంగా జనాభాను ఆటోలో ఎక్కించుకుని డ్రైవర్ వెళుతున్నాడని, సీటుకు ఎడమ, కుడి వైపున అదనంగా ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నాడని పేర్కొన్నారు. అతడే కాదూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఇలానే ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనతో పోలీసులు సీరియస్ అయ్యారు. కఠిన చర్యలకు ఉపక్రమించారు. నిబంధనలకు విరుద్దంగా వెళుతున్న 40 ఆటోలను నిలిపివేశారు. సామర్థ్యానికి మించి తీసుకెళుతున్న ప్రయాణీకులను దించేశారు. ఆటో డ్రైవర్ల అదనపు సీట్లను తొలగించి, చలాన్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు సీట్లలో ప్రయాణీకులకు ఎక్కిస్తే.. ఆటోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసలు ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే.. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి