iDreamPost
android-app
ios-app

అయోధ్య వేడుక వేళ..ప్రధాని అదిరిపోయే స్పీచ్!

Narendra Modi: కోట్లాది మంది హిందువుల కల నేడు నిరవేరింది. కొన్ని శతాబ్ధాలుగా చేసిన పోరాడం నేడు సాకారమైంది. అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావోద్వేగ భరితమైన ప్రసంగం చేశారు.

Narendra Modi: కోట్లాది మంది హిందువుల కల నేడు నిరవేరింది. కొన్ని శతాబ్ధాలుగా చేసిన పోరాడం నేడు సాకారమైంది. అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావోద్వేగ భరితమైన ప్రసంగం చేశారు.

అయోధ్య వేడుక వేళ..ప్రధాని అదిరిపోయే స్పీచ్!

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగం వైభవంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ రామయ్య ప్రాణప్రతిష్ట వేడుక జరిగింది. అంతేకాక తొలిపూజను కూడా ఆయన చేతుల మీదుగానే స్వామివారికి జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది అతిరథ మహారథులు విచ్చేసి.. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. యావత్ భారతదేశం ఈ మధుర క్షణాలను ఎంతో ఆసక్తిగా తిలకించింది. ప్రాణ ప్రతిష్ట జరిగేది అయోధ్యలోనే అయినా.. ఆ సందడి వాతావరణం మాత్రం దేశంలోని ప్రతి ఒక్క దేవాలయంలో.. ప్రతి ఒక్కరి ఇంట్లో నెలకొంది. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ భావోద్వేగ భరితమైన స్పీచ్ ఇచ్చారు.

త్రేతాయుగపు శ్రీరాముని పట్టాభిషేక శోభ మరలా వచ్చిందా అన్నట్లుగా.. నేడు అయోధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. వందల సంవత్సరాల నాటి కల నెరవేరింది. ప్రాణ ప్రతిష్ట జరిగేది అయోధ్యలోనే అయినా.. ఆ సందడి వాతావరణం మాత్రం దేశంలోని ప్రతి ఒక్క దేవాలయంలో అయోధ్య వేడుక కనిపించింది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రధాని మోదీ భావోద్వేగమైన ప్రసంగం చేశారు. జై శ్రీరామచంద్రమూర్తికి  జై అంటూ మోదీ  ప్రసంగాన్ని ప్రారంభించారు. “రామ భక్తులందరికీ నా ప్రణామాలు. ఈరోజు మన రాముడు వచ్చేశాడు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడు అయోధ్య మందిరంలోకి వచ్చేశాడు. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనది. ఇది  సామాన్యమైనది కాదు.

ఎంతోచెప్పాలని ఉన్నా.. నా గొంతు గద్దదంగా ఉంది. మన రాముడు టెంట్ లో ఉండే పరిస్థితులు ఇక లేవు. ఇక నుంచి మన రాముడు ఇకపై దివ్యమైన మందిరంలో ఉంటారు. ఈ అనుభూతిని ప్రతి రామభక్తుడు అనుభవిస్తున్నాడు. జనవరి 22 అనేది ఒక కొత్త కాలచక్రానికి ప్రారంభం. ఈ రోజు మనకు శ్రీరాముడి మందిరం దొరికింది. బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భవించింది. ఆ శ్రీరాముడి దయ వల్ల మనమందరం ఈ క్షణానికి సాక్షులమయ్యాం. ఈ నేల, గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయం.

ఇక ఈ అద్భుతమైన ఘట్టం  ఇంత ఆలస్యంగా జరిగినందుకు మమ్మల్ని క్షమించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నాను. త్రేతాయుగంలో శ్రీరాముడు కేవలం 14 ఏళ్లు మాత్రమే వనవాసానికి వెళ్లారు. కానీ కలియుగంలో మాత్రం వందల యేళ్ల పాటు వనవాసం చేశాడు. భారత న్యాయవ్యవస్థకు ఈ రోజు నేను నమష్కరిస్తున్నాను. శ్రీరాముడి ఆలయ నిర్మాణం న్యాయబద్దంగానే జరిగింది. ఇక శ్రీరాముడు ఒక వివాదం కాదు.. సమాధానం. ఇక రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారిని కూడా ఈ వేడుకకు ఆహ్వానించాము. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. దేశ ప్రజలందరూ ఇవాళ దీపావలీ జరుపుకుంటున్నారు. రాబోయే వెయ్యేళ్ల కోసం పునాది రాయి వేస్తున్నాము” అని ప్రధాని మోదీ తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇది విజయ క్షణమే కాదు.. విన్రమ క్షణం కూడ. రాముడు అందరివాడు. త్రేతాయుగంలో రామడుు వచ్చాకే వేలయేళ్ల పాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది. అలానే రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురు చూపులు ఫలించాయి. సేవా, చింతన, భక్తిని హనుమాన్ నుంచి ప్రేరణ పొందాలి. అలానే ఎవరైన బలహీనులం అని భావించే వారు.. ఉడతను చూసి ప్రేరణ పొందాలి. దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇదే మన నినాదం” అంటూ మోదీ ప్రసంగించారు.