పెట్రోల్ రూ.100కు బదులు రూ.110కి కొట్టించుకుంటే లాభమా?

మనం నిత్య జీతంలో ఏదో అవసరం కోసం బైక్, కార్లు వంటి వాహనాలు వాడుతుంటాము. ముఖ్యంగా చాలా మంది పెట్రోల్ లేదా డీజిల్ ను రౌండ్ ఫిగర్ నెంబర్లకు కొట్టించుకుంటారు. అలానే వీటిపై చాలా మంది కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.

మనం నిత్య జీతంలో ఏదో అవసరం కోసం బైక్, కార్లు వంటి వాహనాలు వాడుతుంటాము. ముఖ్యంగా చాలా మంది పెట్రోల్ లేదా డీజిల్ ను రౌండ్ ఫిగర్ నెంబర్లకు కొట్టించుకుంటారు. అలానే వీటిపై చాలా మంది కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.

ప్రస్తుతం అందరూ సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది బైక్, కార్లు వంటి వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక వాహనాలకు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనం కొట్టించడం సహజం. అయితే కొందరు ఫుల్ ట్యాక్ లను వాహనాలకు కొట్టిస్తుంటారు. చాలా మంది మాత్రం వందలు, రెండు వందలకు పెట్రోల్ పోయించుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో దీని విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.100 కంటే రూ.110కి కొట్టించుకుంటే.. పెట్రోల్ ఎక్కువ వస్తుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అలా పెట్రోల్ పోయించుకుంటేనే లాభమని అభిప్రాయ పడుతుంటారు. ఈ వార్తల్లో నిజం ఎంత? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మనం నిత్య జీతంలో ఏదో అవసరం కోసం బైక్, కార్లు వంటి వాహనాలు వాడుతుంటాము. ముఖ్యంగా చాలా మంది పెట్రోల్ లేదా డిజీల్ ను 100,200,500,1000.. ఇలా రౌండ్ ఫిగర్ నెంబర్ కు కొట్టించుకుంటారు. అలానే మరికొందరు పెట్రోల్‌ బంక్‌కి వెళ్లినప్పుడు రౌండ్ ఫిగర్‌‌లో ఇంధనం కొట్టించుకునేందుకు ఇష్టపడరు. 100 కి బదులు 110, 500కి బదులు 510, వెయ్యికి బదులు 1010 ఇలా కొట్టించుకుంటారు. దీనికి వాళ్లు…తాము నమ్మే కారణాన్ని కూడా చెప్పారు.  ఇలా చేయడం వల్ల మోసపోవడానికి ఛాన్స్ ఉండదని.. ఖచ్చితమైన పరిమాణంలో  ఇంధనం వస్తుందని భావిస్తుంటారు. ఈ సందేహంపై  రైల్వే మాజీ చీఫ్ ఇంజనీర్ అనిమేష్ కుమార్ సిన్హ కీలక విషయాలను పంచుకున్నారు.

పెట్రోల్ బంకుల్లో ఎక్కువ మంది ఏ స్థాయిలో పెట్రోల్ కొట్టించుకుంటున్నారో, అందుకు తగినట్లుగా మిషన్లు సెట్ చేసి ఉంచుతారు. ఎక్కువ మంది 100, 200, 500, 1000 రూపాయాల్లో పెట్రోల్ కొట్టించుకోవడంతో.. ఈ అంకెలతోనే మిషీన్లో కోడ్ సెట్ బంకుల వారు సెట్  చేస్తారు. అదే విధంగా మనం చెప్పే అంకెల ఎంట్రీ కోసం ఒక బటన్ సిస్టమ్ ఉంది. పెట్రోల్ బంకు లో పని చేసే సిబ్బందికి ఇది ఈజీగా ఉంటుంది. ప్రతి సారి మొత్తం అంకెలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఇలా ఉంటే మనలో చాలా మంది పెట్రోల్ పంపులో సెట్టింగ్స్ చేశారని, అందుకే రౌండ్ ఫిగర్ లకు పెట్రోల్ కొట్టించుకుంటే తక్కువ వస్తుందని భావిస్తుంటారు.

నిజానికి ఇంధనాన్ని లీటర్లలో ఇచ్చేందుకు పెట్రోల్ పంప్ యంత్రాన్ని డిజైన్ చేస్తారు. టెక్నికల్ గా దీనినే ఫ్లో మీటర్ అని కూడా పిలుస్తారు. ఎన్ని లీటర్లకు ఎంత డబ్బు అవుతుందనేది.. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా లెక్కిస్తారు. దాని ప్రకారం… ముందు లీటర్లు లెక్కించి.. ఆ తరువాత దానిని రూపాయిల్లోకి మారుస్తారు. మరో విషయం ఏమిటంటే.. మీరు లీటర్లలో కాకుండా రూపాయాల్లో  ఇంధనం కొట్టిస్తే.. లెక్కింపులో కొన్ని పాయింట్లు పరిగణలోకి రాకపోవచ్చు.

ఉదాహరణకు 1.24 లీటర్లు రావాల్సిన చోట..1.2 లీటర్ల పెట్రోలే రావొచ్చు. అలాంటప్పుడు 0.04 లీటర్ల  ఇంధనం నష్టపోయినట్లే. 100, 200 వంటి రౌండ్ ఫిగర్లో కాకుండా 110, 120 రూపాయలకు పెట్రోల్ డీజిల్ తీసుకోవడం వల్ల.. మీరు ఎక్కువ ఆయిల్ పొందుతారనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. మీకు కరెక్ట్ గా పెట్రోల్, డీజిల్ కావాలంటే..రూపాయాల్లో కాకుండా లీటర్ల ప్రకారమే కొట్టించుకోవాలని ఇంధన నిపుణులు సూచిస్తున్నారు.

అయితే లీటర్లలో కొట్టించుకునేందుకు చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకు ఓ బలమైన కారణం ఉంది. లీటర్లలో కొట్టించుకుంటే చిల్లర సమస్య వస్తుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు అంతటా డిజిటల్ పేమెంట్స్ నడుస్తున్నాయి. అందువల్ల మీరు లీటర్లలో ఇంధనం కొట్టించుకొని.. దానికి ఎంత అవుతుందో, ఆ మొత్తం డబ్బును ఫోన్ పే, గూగుల్ పే చేయవచ్చు. తూనికలు, కొలతల శాఖ అధికారులు కూడా పెట్రోల్ పంపు ఫ్లో మీటర్‌ను లీటర్లలోనే కొలుస్తారు. ఎందుకంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ సాంద్రత స్థిరంగా ఉంటుంది.

అందులో ఎలాంటి మార్పు చోటుచేసుకోవడానికి సాధ్యం కాదు. మీకు ఏదైనా సందేహం, అనుమానం ఉంటే సంబంధిత పెట్రోల్‌ బంకు సిబ్బందిని ప్రశ్నించవచ్చు. నిజంగా పెట్రోల్ తక్కువ వచ్చినట్లు అనిపించినా.. నాణ్యతలో తేడా అనిపించినా అక్కడే చెక్ చేసుకోవచ్చు. పెట్రోల్ బంకులో మోసం జరుగుతుందని తెలిస్తే.. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. తక్కువ పెట్రోల్ ఇస్తే పంపుపై భారీ జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments