iDreamPost
android-app
ios-app

ఇండియా పేరు కోసం పాకిస్థాన్ ఎదురుచూపులు! మనం వద్దంటే వారు పెట్టుకుంటారంట..

  • Author Soma Sekhar Updated - 06:13 PM, Thu - 21 December 23

ఈ క్రమంలోనే పానకంలో పుడకలాగా పాకిస్థాన్ ఎంటర్ అయ్యింది. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరును ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్థాన్ ఆ పేరును చేజిక్కించుకోవాలని ఎదురుచూస్తున్నట్లుగా అక్కడి లోకల్ మీడియా వార్తలు రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా..

గత రెండురోజులుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన న్యూస్ ఏదైనా ఉంది అంటే.. అది ఇండియా పేరును భారత్ గా మార్చే విషయమే. ఇక ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలోనే పానకంలో పుడకలాగా పాకిస్థాన్ ఎంటర్ అయ్యింది. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరును ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్థాన్ ఆ పేరును చేజిక్కించుకోవాలని ఎదురుచూస్తున్నట్లుగా అక్కడి లోకల్ మీడియా వార్తలు రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకైతే దేశం పేరు మార్పుపై కేంద్ర ఎలాంటి ప్రకటనా చేయలేదు.

భారతదేశం ఇండియా అనే పేరును ఐక్యరాజ్యసమితి సమక్షంలో భారత్ అని మార్చుకుంటే.. పాక్ తమ దేశానికి ఇండియా అని పేరు పెట్టుకోవచ్చని స్థానిక మీడియా వార్తలు రాసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. చాలా కాలంగా పాకిస్థాన్ జాతీయవాదులు ఇండియా అనే సింధూ ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి.. ఇండియా అనే పేరు మీద తమకే ఎక్కువగా హక్కు ఉన్నట్లు వారు చెబుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ట్విట్టర్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు సౌత్ ఏసియా ఇండెక్స్ అనే ఖాతాదారుడు. దీంతో ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.

పాకిస్థాన్ ఇండియా పేరు పెట్టుకుంటే.. ఆఫ్ఘానిస్థాన్ పాకిస్థాన్ పేరు.. రష్యా ఆఫ్ఘానిస్థాన్ పేరును పెట్టుకుంటాయాని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. ఇక ఈ విషయమై టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. అక్కడ అసలు గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయ్యారయ్యారని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి పాకిస్థాన్ ఇండియా పేరు పెట్టుకుంటాం అన్న వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.