iDreamPost

500 ఏళ్ల నాటి కోట్ల విలువ చేసే విగ్రహం తిరిగి భారత్ కు!

500 Year Old Bronze Idol: ఇండియాను కొన్నేళ్ల పాటు బ్రిటిష్ వారు పాలించారు. అంతేకాక ఇక్కడి సంపాదను భారీగా దోచుకున్నారు. అంతేకాక చివర్లో వెళ్తు వెళ్తు.. భారత్ లోని విలువైన వస్తువులను, విగ్రహాలను తీసుకెళ్లారు.

500 Year Old Bronze Idol: ఇండియాను కొన్నేళ్ల పాటు బ్రిటిష్ వారు పాలించారు. అంతేకాక ఇక్కడి సంపాదను భారీగా దోచుకున్నారు. అంతేకాక చివర్లో వెళ్తు వెళ్తు.. భారత్ లోని విలువైన వస్తువులను, విగ్రహాలను తీసుకెళ్లారు.

500 ఏళ్ల నాటి కోట్ల విలువ చేసే విగ్రహం తిరిగి భారత్ కు!

భారత దేశం అనేది అనేక కళా నైపుణ్యాలకు ప్రసిద్ది. ఎన్నో రకాల శిల్ప కళలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పూర్వం వివిధ రకాల కళలతో భారత దేశం విరాజిల్లుతుండేది. అలానే ఎన్నో రకాల వారసత్వ సంపదలతో కలకల్లాడేది.  అలాంటి భారత్ దేశాన్ని పర్షియన్లు నాశనం చేశారు. ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ వాళ్లు.. ఇక్కడి సంపదను దోచుకున్నారు.  ఇండియాను వదిలి  వెళ్లే క్రమంలోనే అనేక విలువైన విగ్రహాలను, ఇతర వస్తువులను తీసుకెళ్లారు. ఇక చాలా ఏళ్ల తరువాత ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా భారత్ కి తిరిగి వస్తున్నాయి. అలానే తాజాగా 500 ఏళ్ల నాటి ఓ విగ్రహం తిరిగి భారత్ కు రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఇండియాను కొన్నేళ్ల పాటు బ్రిటిష్ వారు పాలించారు. అంతేకాక ఇక్కడి సంపాదను భారీగా దోచుకున్నారు. అంతేకాక చివర్లో వెళ్తు వెళ్తు.. భారత్ లోని విలువైన వస్తువులను, విగ్రహాలను తీసుకెళ్లారు. అలా తరలివెళ్లిన పురాతనమైన విగ్రహాలు చాలా వరకు అక్కడే ఉన్నాయి. ఇటీవల కొంతకాలం నుంచి వివిధ దేశాల్లో ఉన్న భారత్ వస్తువులు తిరిగి వస్తున్నాయి. కేంద్రం చొరవ తీసుకోవడంతో ఇప్పటికే కొన్ని విలువైన, ప్రత్యేకమైన వస్తువులు భారత్ కు తిరిగి వచ్చాయి. అలా తమ పుట్టినింటికి వచ్చే జాబితాలో మరో విగ్రహం వచ్చి చేరింది. దాదాపు 500 ఏళ్ల నాటి కాస్య విగ్రహం భారత్ కు తిరిగి రానుంది.

500-year-old statue returned to India! 01

తమిళనాడులోని  ఓ దేవాలయంలో 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహం చోరికి గురైంది. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి, స్వామీజీ తిరుమంకై ఆళ్వార్‌ కాంస్య విగ్రహాన్ని ఆ కాలంలో  ఏర్పాటు చేశారు. ఇది 60 సెంటిమీటర్ల వ్యాసార్థం తో ఉంటుంది. ఆ విగ్రహాన్ని బ్రిటిషర్లు తమిళనాడులోని ఓ ప్రముఖ దేవాలయం గుడి నుంచి చోరీ చేసి పట్టుకుపోయారు. అనంతరం బ్రిటన్ లోని ప్రతిష్ఠాత్మ యూనివర్సిటీ అయిన ఆక్స్ ఫర్ట్ లోని అష్మోలియన్ మ్యూజియంలోనే  ఉంచారు. 1967లో సోథెబీ వనేలంలో డాక్టర్ జేఆర్. బెల్మాంట్ అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఈ విగ్రహంకు  సంబంధించిన విషయాల గురించి అష్మోలియన్ పలు విషయాలను వెల్లడించింది. ఈ కాంస్య విగ్రహం చరిత్ర గురించి గతేడాది ఒక పరిశోధకుడు తమకు సమాచారం అందించాడని తెలిపింది. దీంతో  భారత హైకమిషన్ ను అప్రమత్తం చేశామని అష్మోలియన్ మ్యూజియం  అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలని మ్యూజియం వారిని భారత ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసింది.  ఇండియన్ సర్కార్ అభ్యర్థన మేరకు విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 11న తేదీనే ఈ నిర్ణయం తీసుకుంది. 500 ఏళ్ల నాటి కోట్ల విలువైన తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహం తిరిగి భారత్ కు రానున్న సందర్భంగా అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో దొంగిలించబడి యూకే చేరిన అనేక కళాఖండాలను తిరిగి తెప్పించే ప్రక్రియ కొంతకాలం నుంచి కొనసాగుతోంది. గత ఏడాది ఆగస్టులో తమిళనాడుకు చెందిన నవనీత కృష్ణ కాంస్య శిల్పాన్ని బ్రిటన్ లోని  భారత హైకమిషనర్ కు అప్పగించారు. అది 17వ శతాబ్ధానికి చెందిన విగ్రహం. మొత్తంగా ఇలా భారత్ కొల్పోయిన విగ్రహాలు తిరిగి వస్తుండటం చాలా సంతోషంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి