మహిళా ప్యాసింజర్ ను అమ్మడానికి ప్రయత్నించిన ఓలా క్యాబ్ డ్రైవర్.. చివరికి ఏమైందంటే?

Ola cab driver: మహిళా ప్యాసింజర్ కు షాక్ ఇచ్చిన ఓలా క్యాబ్ డ్రైవర్. అమ్మడానికి ప్రయత్నించి దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అసలు ఏం జరిగిందంటే?

Ola cab driver: మహిళా ప్యాసింజర్ కు షాక్ ఇచ్చిన ఓలా క్యాబ్ డ్రైవర్. అమ్మడానికి ప్రయత్నించి దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అసలు ఏం జరిగిందంటే?

ఓలా, ఉబర్, ర్యాపిడో అందుబాటులోకి వచ్చాక ప్రయాణం మరింత సులువైపోయింది. సొంత వాహనం అవసరం లేకున్నా ప్రయాణించే సౌకర్యం ఏర్పడింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే చాలు క్షణాల్లో వెహికల్ ఇంటి ముందుకే వచ్చేస్తోంది. ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చేరాల్సిన గమ్యస్థానానికి వెళ్లిపోవచ్చు. నిత్యం అందుబాటులో ఉంటున్నారు బైక్, క్యాబ్ డ్రైవర్లు. అయితే ఒక్కోసారి వీరి వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బుకింగ్ క్యాన్సిల్ చేయమని కోరడం, అధిక డబ్బులు వసూలు చేయడం వంటి వాటికి పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఓలా క్యాబ్ డ్రైవర్ మహిళా ప్యాసింజర్ కు ఊహించని షాక్ ఇచ్చాడు.

ఆమెను అమ్మడానికి ప్రయత్నించాడు. కానీ, ఆమె చాకచక్యంతో వ్యవహరించడంతో బయటపడింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి 10:30 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది ఓ మహిళ. మొదటగా ఆమె విమానాశ్రయం వద్ద ఉన్న ఓలా క్యాబ్ పికప్ స్టేషన్‌ వద్దకు వచ్చింది. అక్కడే ఉన్న ఓలా క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్తానని క్యాబ్ లో ఎక్కించుకున్నాడు. కారు ప్రయాణం మొదలైన తర్వాత, డ్రైవర్‌ అనుమానాస్పద ప్రవర్తన మహిళకు అర్థమైంది. ఆమె తన గమ్యస్థానాన్ని నిర్ధారించుకునేందుకు డ్రైవర్‌తో మాట్లాడాలని ప్రయత్నించింది.

క్యాబ్ డ్రైవర్ ఆమె మాటలను వినిపించుకోకుండా ముందుకుసాగాడు. ఓలా యాప్‌లో వచ్చిన ఓటీపీ డ్రైవర్‌కు చెప్పినా అతను దాన్ని తన యాప్ లో ఎంటర్ చేసుకోలేదని తెలిపింది. తన ఓలా యాప్ పని చేయడం లేదని చెప్పి, మహిళను తన ఫోన్‌లో డెస్టినేషన్‌ను ఎంటర్ చేయమని కోరాడు. అంతేకాకుండా, ఓలా యాప్‌లో చూపించిన రూ.1,300లకు బదులుగా, తన కారు సెడాన్ కాబట్టి రూ.1,500లు ఇవ్వాల్సి ఉంటుందని డ్రైవర్ డిమాండ్ చేశాడు. డ్రైవర్‌ ప్రవర్తన చూసి ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. తనను ఎక్కడ అమ్మేస్తాడోనని ఆందోళనకు గురైంది. వెంటనే ఆ మహిళ క్యాబ్ డ్రైవర్‌ను విమానాశ్రయానికి తిరిగి తీసుకెళ్లమని కోరింది. కానీ డ్రైవర్ మాత్రం ఆమె మాట వినిపించుకోలేదు.

కొంత దూరం వెళ్లిన తర్వాత కారును ఓ చోట ఆపి, తన పేమెంట్ యాప్ పని చేయడం లేదని చెప్పి, రూ.500 క్యాష్ ఇవ్వమని ఆమెను కోరాడు. డ్రైవర్ తీరును గమనించిన ఆమె వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఓలా క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఆ మహిళ. హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడే ఉద్దేశ్యం ఉన్నట్లుగా క్యాబ్ డ్రైవర్ ప్రవర్తన ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Show comments