Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల! కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మల సీతారామన్

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల! కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మల సీతారామన్

Nirmala Sitharaman Comments On Petrol and Diesel Prices Down: యూనియన్ బడ్జెట్ 2024 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు సంబంధించి నిర్మల సీతారామన్ ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారేమో అని చాలా మంది ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా ఇంధన ధరల తగ్గుదలపై నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Nirmala Sitharaman Comments On Petrol and Diesel Prices Down: యూనియన్ బడ్జెట్ 2024 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు సంబంధించి నిర్మల సీతారామన్ ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారేమో అని చాలా మంది ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా ఇంధన ధరల తగ్గుదలపై నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పెట్రోల్ భారాన్ని మోయలేక చాలా మంది సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది అయితే ఎందుకొచ్చిన భారం అని చెప్పి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లిపోతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు కూడా పెరిగాయి. అయితే ఈవీల గోల పడలేక చాలా మంది పెట్రోల్ వాహనాల్లోనే బతుకు బండిని సాగిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సామాన్య, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు అనేక వ్యయప్రయాసలు పడుతున్నారు. కాగా యూనియన్ బడ్జెట్ లో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయేమో అని చాలా మంది ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

అయితే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మల సీతారామన్ మీడియాలు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బడ్జెట్ పై, ఆయా రాష్ట్రాల పథకాలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల అంశంపై కూడా మాట్లాడారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంటుందని నిర్మలమ్మ స్పష్టతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుపై  సఖ్యత కుదరాలని, ఏకాభిప్రాయం రావాలని అన్నారు. సఖ్యత కుదిరినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. అయితే ఈ ఇంధన ధరల తగ్గింపు విషయంలో అన్ని రాష్ట్రాలూ కలిసి వచ్చి ఒకే నిర్ణయంపై ఉంటేనే జీఎస్టీ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.  

Show comments