సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం! న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయి!

Supreme Court: దేశంలోని ప్రతీ కోర్టులో న్యాయదేవత విగ్రహం కచ్చితంగా ఉంటుంది. చిన్న స్థాయి కోర్టు నుంచి .. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయ దేవత విగ్రహాన్ని ఉంచుతారు. న్యాయదేవత విగ్రహం అనగానే కళ్లకు గంతలు, కుడి చేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఉండే పొడవైన కత్తిని కనిపించేది.

Supreme Court: దేశంలోని ప్రతీ కోర్టులో న్యాయదేవత విగ్రహం కచ్చితంగా ఉంటుంది. చిన్న స్థాయి కోర్టు నుంచి .. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయ దేవత విగ్రహాన్ని ఉంచుతారు. న్యాయదేవత విగ్రహం అనగానే కళ్లకు గంతలు, కుడి చేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఉండే పొడవైన కత్తిని కనిపించేది.

భారత దేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్ళకు గంతలు ఉండేవి. చట్టం అందరికీ సమానమే అనే ఉద్దేశంతో న్యాయదేవత కళ్లకు గంతలు కట్టేవారు. చట్టం గుడ్డిది కాదు అన్న సందేశాన్ని ఇచ్చేలా న్యాదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్ ని తొలగించారు. అంతేకాదు శిక్షకు ప్రతీకగా నిలిచే ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని సూచించేలా ఓ బుక్‌ని చేర్చారు. కొత్త మార్పులతో న్యాయదేవత (లేడీ ఆఫ్ జస్టిస్) విగ్రహం సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల గ్రంథాలయంలో దర్శనమిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రిటీష్ వలసవాద చట్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయదేవత విగ్రహంలోనే మార్పులు చేయాయలని గతంలోనే జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ‘న్యాయదేవత కళ్లకు గంతలు అనవసరం.. చట్టం ఎప్పటికీ గుడ్డిది కాదు. అందరినీ సమానంగా చూస్తుంది.. కత్తి హింసకు ప్రతీక. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టల మేరకే తీర్పునిస్తుంది’ అని అన్నారు జస్టిస్ చంద్రచూడ్. దేశంలోని ప్రతీ కోర్టులో న్యాయదేవత విగ్రహం కచ్చితంగా ఉంటుంది. న్యాయదేవత విగ్రహం పేరు వినగానే మనకు కొన్ని గుర్తుకు వస్తాయి. న్యాయ దేవత కళ్లకు నల్లటి వస్త్రం కట్టి ఉంటుంది, ఎడమ చేతిలో ఒక కత్తి.. కుడి చేతిలో ఒక త్రాసు కనిపిస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ దేవత అంటే మనకు ఇవే గుర్తుకు వస్తాయి. వెండితెరపై కోర్టు సీన్లు ఎంతో ఎమోషన్ గా కనిపిస్తుంటాయి. ఇప్పుడు న్యాయ దేవత పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు న్యాయ దేవత కళ్లు తెరిచింది.

కొత్తగా మార్పులు చేసిన న్యాయదేవత విగ్రహం.. సుప్రీం కోర్టు జడ్జిల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలుసోషల్ మీడియాలో వైరలగ్‌గా మారాయి. చట్టానికి కళ్లు ఉండవని.. ఎందుకంటే డబ్బు, అధికారాన్ని బట్టి.. నిందితులకు చట్టాలు, తీర్పులు ఉండవని.. న్యాయ దేవత ముందు అందరూ సమానమేనని చెప్పేందుకే అలా ఉంచారు. కానీ ఇప్పుడు కొత్త చట్టాలు అమలవుతున్నాయి.. దానికి తగ్గట్టుగానే న్యాయదేవత ప్రతిమను కూడా మార్చాలన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే న్యాయదేవత విగ్రహంలో మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ఇన్నాళ్ళు మనం కోర్టుల్లో చూసే న్యాయ దేవత జస్టియా అనే గ్రీకు దేవత. జస్టిస్ అనే పదం నుంచి జస్టియా అనే పేరు వచ్చిందంటారు. 17వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ కోర్టు అధికారి ఈ జస్టియా విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా మన దేశానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలో న్యాయ దేవత విగ్రహాన్ని ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది.బ్రిటిషర్లు దేశం నుంచి వెళ్లిపోయిన దాదాపు 7 దశాబ్దాల తర్వాత… ఇప్పుడు న్యాయదేవత కళ్లు తెరిచింది.

Show comments