భారతదేశం అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, సైన్స్.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇండియా తన సత్తా చాటుతోంది. మన దేశం నుంచి ఎందరో విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. అలాగే అక్కడి కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఉద్యోగులుగానే కాదు స్టార్టప్‌లు పెట్టి పెద్ద కంపెనీలుగానూ మార్చి వేలాది ఉందికి జాబ్స్ ఇస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ భారత్ గణనీయ వృద్ధి సాధిస్తోంది.
జాబిల్లి మీద రహస్యాలు తెలుసుకునేందుకు గానూ చంద్రయాన్-3ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించిన ఇస్రో.. సూర్యుడి పైకి ఆదిత్య ఎల్-1ను కూడా విజయవంతంగా పంపింది. చంద్రయాన్, సూర్యయాన్ ప్రయోగాల తర్వాత సముద్రంలోని సీక్రెట్స్ తెలుసుకునేందుకు సముద్రయాన్ ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. ఒకవైపు శాస్త్ర, సాంకేతిక, క్రీడా, వినోద, ఆర్థిక రంగాల్లో ఇండియా దూసుకెళ్తుంటే.. మరోవైపు దాయాది పాకిస్థాన్‌లో మాత్రం పరిస్థితులు గంగదరగోళంగా ఉన్నాయి.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ప్రస్తుత గందరగోళానికి, రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాతో పాటు మాజీ స్పై మాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని షరీఫ్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారత్ పైన ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. ఇండియా చంద్రుడి మీదకు చేరుకుందని.. జీ20 మీటింగ్‌తో అందర్నీ ఆకట్టుకుందన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం బిలియన్ డాలర్ల అప్పు కోసం ప్రపంచ దేశాలను అడుక్కుంటోందన్నారు నవాజ్ షరీఫ్. పాత అప్పులను తీర్చలేని స్థితిలో పాక్ ఉండటం విచారకరమని వాపోయారు.
ఇదీ చదవండి: తెలంగాణలోనూ RTCలో మహిళలకు ఉచిత ప్రయాణం!