Nidhan
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని మోడీ సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు సీఏఏ అంటే ఏంటి? ముస్లింలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని మోడీ సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు సీఏఏ అంటే ఏంటి? ముస్లింలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు విషయంలో సంచలన ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచే ఈ చట్టం అమల్లోకి వస్తుందని బీజేపీ సర్కారు వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం 2019లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందినా ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు అమలుపై కీలక ప్రకటన చేయడం సెన్సేషనల్‌గా మారింది. అందరూ ఒక్కసారి సీఏఏ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు సీఏఏ అంటే ఏంటి? ఈ చట్టాన్ని ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? లాంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సీఏఏ అంటే ఏంటి?
పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులు, శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశ్యం. 2017, డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు దీనికి అర్హులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్‌లో హింసకు గురై.. 2014కు ముందు ఇండియాకు వచ్చిన వాళ్లందరికీ ఇక్కడి పౌరసత్వం వర్తిస్తుంది. హిందువులు, సిక్కులతో పాటు క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం ఇవ్వనుంది ప్రభుత్వం.
పాక్, బంగ్లా, ఆఫ్ఘాన్ నుంచి వచ్చిన వలసదారులు, శరణార్థులకు ఎలాంటి ధృవపత్రాలు లేకపోయినా, ఒకవేళ ఉండి వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు. దీని కోసం పౌరసత్వ సవరణ చట్టం-1995లో సవరణ చేసింది కేంద్రం. భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివాసం ఉండాలనే రూల్‌ను 5 ఏళ్లకు తగ్గించింది ప్రభుత్వం. పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేసేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా ప్రకటించింది.
ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
పొరుగు దేశాల నుంచి వచ్చిన హిందువులతో పాటు ఇతర మతాల వలసదారులు, శరణార్థులకు సీఏఏ వర్తిస్తుందన్న కేంద్రం.. ముస్లింలను మాత్రం దీని పరిధిలోకి తీసుకురాలేదు. సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలు రారని పేర్కొనడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే 2016లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన టైమ్‌లో ఎన్డీయే మిత్రపక్షమైన అసోం గణపరిషత్తో పాటు మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఎట్టకేలకు 2019లో సీఏఏను పార్లమెంట్ ఆమోదించింది. అయితే విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం కల్పించి.. కేవలం ముస్లింలను సీఏఏ పరిధి నుంచి మినహాయించడం ఆ కమ్యూనిటీ నుంచి నిరసనలు, ఆందోళనలకు కారణమైంది.
అసలు సీఏఏలో ఏం ఉంది?
పౌరసత్వ సవరణ చట్టాన్ని కేవలం విదేశాల నుంచి మన దేశానికి వలస వచ్చే వారి గురించే తయారు చేశారు. దీని వల్ల ఇప్పటికే భారత పౌరసత్వం కలిగిన ఏ మతాల పౌరులకూ ఇబ్బంది లేదని ఆ చట్టం చెబుతోంది. ఈ విషయంలో ముస్లింలు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఓ క్లారిటీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ అమలు ద్వారా దేశంలోని ముస్లిం పౌరులకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చారు. వాళ్ల పౌరసత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని గ్యారెంటీ ఇచ్చారు.
ముస్లింలకు కల్పించకపోవడంపై క్లారిటీ
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘానిస్థాన్ నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడానికి గల కారణాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా దేశాలన్నీ ముస్లిం మెజారిటీ కంట్రీస్ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏకంగా లోక్‌సభలోనే స్పష్టం చేశారు. ఆ దేశాల్లో ముస్లింలు మెజారిటీ కావడంతో వాళ్లు హింసకు గురికాలేదని తెలిపారు. ఆ 3 దేశాల్లోనూ మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు మతపరంగా తీవ్ర హింసను ఎదుర్కొన్నారని చెప్పారు. అందుకే ఈ 3 దేశాలకు చెందిన ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వడం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: 4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం.. చంద్రబాబుపై CID ఛార్జ్ షీట్