iDreamPost

4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం.. చంద్రబాబుపై CID ఛార్జ్ షీట్

CID Charge Sheet On Chandrababu: అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ కీలక విషయాలను వెల్లడించింది. చంద్రబాబు అండ్ కోపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది.

CID Charge Sheet On Chandrababu: అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ కీలక విషయాలను వెల్లడించింది. చంద్రబాబు అండ్ కోపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది.

4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం.. చంద్రబాబుపై CID ఛార్జ్ షీట్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధంచి చంద్రబాబుపై ఛార్జ్ షీట్ నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ సోమవారం వెల్లడించింది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి ఈ కుంభకోణం జరిగినట్లు నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. అలాగే ఏపీ మాజీ మంత్రి నారాయణను కూడా చంద్రబాబుతో పాటు ముద్దాయిగా సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

అమరావతి రాజధానిలో చంద్రబాబు అండ్ కో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ పేరిట పెద్ద కుంభకోణం చేశారు అంటూ సీఐడీ నిర్ధారణ చేసింది. అక్కడున్న అసైన్డ్ భూములను చంద్రబాబు, ఆయన బినామీలే కాజేసినట్లు ఏపీ సీఐడీ గుర్తించింది. అసైన్డ్ భూములను కాజేసేందుకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు రికార్డులను కూడా ట్యాంపరింగ్ చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణతో పాటుగా మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ లను కూడా సీఐడీ ముద్దాయిలుగా చేర్చి సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరి.. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి