iDreamPost
android-app
ios-app

రూ.12 లక్షల కోట్లతో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం సూపర్ ప్లాన్!

  • Published Apr 21, 2024 | 3:49 PM Updated Updated Apr 21, 2024 | 3:49 PM

ఇప్పటికే మోదీ సర్కార్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వరుసగా రెండు సార్లు నరేంద్ర మోదీ ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పుడు మూడోసారి మరలా అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ రైల్వేస్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మోదీ సర్కార్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వరుసగా రెండు సార్లు నరేంద్ర మోదీ ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పుడు మూడోసారి మరలా అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ రైల్వేస్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.12 లక్షల కోట్లతో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం సూపర్ ప్లాన్!

కేంద్రంలో కనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే రైల్వే రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మోదీ 3.O మెగా ప్లాన్ పేరిట రూ. 10 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత రైల్వే రంగానికి సంబంధించి వంద రోజుల ప్లాన్ ఒకటి పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. వంద రోజుల్లో అనుకున్నవన్నీ అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ప్లాన్ లో భాగంగా ప్రయాణికులకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వీటిలో టికెట్ క్యాన్సిల్ చేసుకున్న 24 గంటల్లోనే రిఫండ్ ఇవ్వడం.. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను తీసుకురావడం, దేశవ్యాప్తంగా మూడు ఎకనామిక్ కారిడార్ల నిర్మాణం, రైల్వేకి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సూపర్ యాప్ ని తీసుకురావడం వంటివి ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్రం తీసుకురానున్న ఈ యాప్ లో రైల్వే సౌకర్యాలకు సంబంధించిన వివరాలు,ఫుడ్ బుకింగ్, టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, లైవ్ టేకింగ్ వంటి ఫీచర్స్ తో యాప్ ని తీసుకొచ్చే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. 100 రోజుల ప్లాన్ లో ఇన్సూరెన్స్ పాలసీ స్కీం కూడా ఉంటుందని తెలుస్తోంది. పీఎం రైల్ యాత్రి బీమా యోజన పేరుతో ఈ స్కీం  ఉండనుందని సమాచారం. అలానే 10 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్ల పెట్టుబడులను 2024-29 ఐదేళ్ళ పీరియడ్ లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పెట్టుబడులతో భారతీయ రైల్వేలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిగా మార్చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వందే భారత్ రైళ్లను కూడా 3 కేటగిరీల్లో దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 100 కిలోమీటర్ల లోపు వందే మెట్రో రైళ్లు, 100 నుంచి 550 కిలోమీటర్ల లోపు వందే చైర్ కార్ రైళ్లు, 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే మార్గాల్లో వందే స్లీపర్ రైళ్లు తీసుకొచ్చేందుకు ప్లాన్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో 50 రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ ట్రెయిన్ 2029 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. నార్త్, సౌత్, ఈస్ట్ ఇండియాలో మరో మూడు బుల్లెట్ ట్రెయిన్ లు తీసుకొచ్చే ప్లాన్ లో కేంద్రం ఉంది. ఇక 3 ఎకనామిక్ కారిడార్లకు సంబంధించి మొత్తం 40 వేల కిలోమీటర్లు పైగా మేర నిర్మించాల్సి ఉంది. వీటికి రూ. 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంతేకాదు దేశంలో 1300 రైల్వే స్టేషన్స్ ని ప్రైవేట్ రంగంతో కలిసి ఆధునిక హంగులతో రీడెవలప్ చేస్తారని తెలుస్తోంది. ఈ స్టేషన్స్ లో షాపింగ్ మాల్స్, ఎయిర్ పోర్ట్ లో ఉండే లాంజ్ లు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మెట్రో రైళ్లను పట్టణాలకు కూడా విస్తరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.