డబ్బు కోసం ఎంతకు తెగించాడు.. ఇంతకీ ఏం చేశాడంటే?

చాలామంది ఈజీగా డబ్బును సంపాదించడం కోసం ఈ మధ్య కాలంలో వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా డబ్బుకోసం ఎంతకు తెగించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

చాలామంది ఈజీగా డబ్బును సంపాదించడం కోసం ఈ మధ్య కాలంలో వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా డబ్బుకోసం ఎంతకు తెగించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇటీవల కాలంలో ఆన్ లైన్ వివాహ పరిచయాల వెనుక మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ తరహా మోసాలు ఎక్కువగా మ్యాట్రిమోనియల్ సైట్లలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చాలామంది ఈజీగా డబ్బును సంపాదించడం కోసం ఈ యాప్ లలో నకిలీ ప్రొఫైల్స్ ను పెట్టి,పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వారికి రాను రాను ఇదొక వ్యాపారంలా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఘరానా మోసగాడు మ్యాట్రిమోనియల్ యాప్ ను వినియోగించి ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తెలివిగా బురిడి కొట్టించాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మ్యాట్రిమోనియల్ సైట్లలో వివిధ పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి పెళ్లి ముసుగులో.. ఓ మహిళను మోసం చేసిన ఘరానా మోసగాడి గుట్టు రట్టైంది. ముఖ్యంగా ఈ కేటుగాడి వలలో చిక్కుకొని మోసపోయిన బాధితురాలు ఫిర్యాదు మేరకు తాజగా బంగూర్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో బాధితురాలు పోలీసులకు తెలిపిన కథనం మేరకు.. ముంబాయికి చెందిన 34 ఏళ్ల మహిళ COVID-19 కారణంగా తన భర్తను కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఒంటిరిగా జీవిస్తున్న ఆ మహిళకు తనకంటూ తోడు ఉండాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆమె మళ్లీ రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెట్టారు. ఇక కుటుం సభ్యుల ఒత్తిడి కారణంగా ఆ మహిళ మ్యాట్రిమోనియల్ సైట్లలో తన డిటైల్స్ ను రిజిస్టర్ చేసుకుంది.

ఆ సమయంలోనే ఈ మహిళకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా.. సాగర్ గుప్తే (35) అనే వ్యక్తి పరిచయమైయ్యాడు. పైగా అతను ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇక అప్పటి నుంచి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, తరుచు మాట్లాడుకోవడం చేసేవారు. కానీ, పరస్పరం ఎప్పుడు కలుసుకోలేదు. ఇకపోతే సాగర్ గుప్తే తనని తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. దీంతో బాధిత మహిళ అతడు చెప్పేవన్ని నిజాలేనని నమ్మడం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుంచి సాగర్ గుప్తే.. బాధిత మహిళకు వివిధ కారణాల చెప్తు డబ్బును ఉడాయించేవాడు. ముఖ్యంగా తన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆమె తర్వాత మరణించిందని, ఆ తర్వాత తాను ప్రమాదంలో పడ్డానని కారణాలు చెప్పి ఆ మహిళ దగ్గర సుమారు రూ.56,000 వరకు వసూలు చేశాడు.

అయితే బాధిత మహిళ డైరెక్ట్ గా ఎప్పుడు కలుద్దమని చెప్పిన ఏదో ఒక కారణాలు చెప్పి కలవకుండా తప్పించుకొనేవాడు. అంతేకాకుండా.. ఓ రోజు బాధితురాలి తండ్రి తండ్రి అనారోగ్యం పాలైనప్పుడు, ఆసుపత్రిలో చేరడానికి డబ్బు అవసరం రావడంతో.. వెంటనే ఆమె గుప్తేకు సహాయం కోరింది. కానీ, ఆయన మాత్రం ఆ మహిళ ఫోన్స్ కు స్పందించకుండా దూరంగా ఉండేవాడు. దీంతో గుప్తే పై సదరు మహిళకు అనుమానం వచ్చింది. దీంతో ఓ రోజున ఆ మహిళ..  మ్యాట్రిమోనియల్ యాప్ ఓపెన్ చేసి చూడగా గుప్తే పేరుతో పలు ప్రొఫైల్ కనిపించడంతో ఆమె అనుమానం బలపడింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ వెంటనే బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.

అయితే మహిళ ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు నమోదు చేసుకున్నారు. వెంటనే ముంబయిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ భోయిట్, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనిల్ థాకరే నేతృత్వంలో.. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వివేక్ తాంబే, అతని బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే.. మొబైల్ కాల్ రికార్డు, సాంకేతిక విశ్లేషణ ద్వారా, వారు ఈ సెప్టెంబర్ 10న నిందితుడిని గుర్తించి రెస్ట్ చేశారు. అయితే పోలీసుల అరెస్ట్ చేసిన గుప్తే పూర్తి వివరాలు ఆరా తీయగా.. అతడి అసలు పేరు సాగర్ కృష్ణకుమార్ ఘోసల్కర్ అని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. అతడు నీలం అపార్ట్‌మెంట్, MG రోడ్, LT నగర్, గోరేగావ్ వెస్ట్‌లో నివసిస్తున్నాడని తెలిసింది. దీంతో ఆ నిందితుడిపై ఐపీసీ,ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరీ, మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా మహిళను భారీగా మోసం చేసిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments