iDreamPost
android-app
ios-app

అలాంటి అమ్మాయిలే టార్గెట్! ఏకంగా 25 పెళ్లిళ్లు! చివరికి?

  • Published Jul 29, 2024 | 4:00 PM Updated Updated Jul 29, 2024 | 4:00 PM

Maharashtra: ఈ కాలంలో కొంతమంది కేటుగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ లైఫ్ గడపాలని భావిస్తున్నారు. ఎదుటి వారికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు.

Maharashtra: ఈ కాలంలో కొంతమంది కేటుగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ లైఫ్ గడపాలని భావిస్తున్నారు. ఎదుటి వారికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు.

అలాంటి అమ్మాయిలే టార్గెట్! ఏకంగా 25 పెళ్లిళ్లు! చివరికి?

ఇటీవల కొంతమంది కేటుగాళ్లు డబ్బు సంపాదించాలని ఎన్నో అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి దారుణంగా మోసం చేస్తున్నారు.  మీ పెట్టుబడికి రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని కొన్ని ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి అందినంత దోచుకుంటున్నారు. చైన్ స్నాచింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతూ అడ్డగోలిగా డబ్బు సంపాదిస్తున్నారు.  సమాజంలో ఎక్కడో అక్కడ నిత్య పెళ్లికొడుకు, నిత్య పెళ్లి కూతుర్లు దర్శనమిస్తూనే ఉంటారు. అమాయకులను మోసం చేసి అందినంత డబ్బు దోచుకొని ఉడాయిస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఓ యువకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 పెళ్లిళ్లు చేసుకున్నావు.. చివరికి ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని పాల్ఘర్ కి చెందిన ఓ వ్యక్తి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటో ఎంతోమంది మహిళలను దారుణంగా మోసం చేశాడు. ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో నిఘా పెట్టి నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యక్తి అసలు పేరు ఫిరోజ్ షేక్. వివిధ ప్రాంతాల్లో అతని పేరు రహ్మాన్, అన్వర్, రహీమ్, సురేష్, రమేష్ ఇలా పేర్లు మార్చుకుంటూ తన పనులు కానిస్తుంటాడు. ఫిరోజ్ ఇప్పటి వరకు 25 మందికిపైగా మహిళలను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వధువు నగలు, డబ్బు, కానుకలు అన్నీ సర్ధుకొని ఉడాయించేస్తాడు. అతని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్ ఎక్కుడగా పెళ్లి కాని యువతులు, పెళ్లై భర్తలు చనిపోయిన వారి వివరాలు సేకరించి వారికి మీ జీవితాలకు వెలుగు ఇస్తా అంటూ మాయ మాటలు చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు.

పెళ్లి సమయంలో కలిసి బతకాలి కట్న కానుకలు తేవాలని కోరుతాడు.అతని మాటు నమ్మి పెళ్లికూతురు కుటుంబ సభ్యులు కట్న కానుకలు సమర్పిస్తుంటారు. వాటిని సర్ధుకొని ఉడాయించి మరో ప్రాంతంలో పేరు మార్చుకొని అమ్మాయిలకు, వితంతువులకు వల విసిని పెళ్లి కొడుకు అవతారం ఎత్తుతాడు. ఫిరోజ్ పై గతంలో కేసులు నమోదు అయి 6 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు..అయినా అతనిలో మార్పు రాలేదు. పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పిరోజ్ పై నలసోపరాలో ఓ మహిళ కేసు పెట్టింది. పెళ్లి పేరుతో పోలీసులు వలపన్ని ఫిరోజ్ ని పట్టుకున్నారు. ఈ సందర్బంగా పాల్ఘర్ పోలీసులు మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పెళ్లి అనగానే వరుడికి సంబంధించి పూర్తి వివరాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని.. అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.