CM మమత బెనర్జీ తలకు గాయం.. ఫొటోలు విడుదల చేసిన TMC

Mamata Banerjee is Injured: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి నుదిటిపై గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Mamata Banerjee is Injured: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి నుదిటిపై గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి తీవ్రంగా గాయపడ్డారు. నుదిటిపై ఆమెకు గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఫోటోను ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటోలో ఆమె నుదిటిపై తీవ్రమైన గాయం కనిపిస్తుంది. మమతా బెనర్జీ ఇంట్లో గాయపడ్డారని.. వెంటనే ఆమెను కోల్‌కోతా లోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు టీఎంసీ నేతలు చెబుతున్నారు. మమతా బెనర్జీకి గాయాం అయిన విషయం తెలుసుకొని నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఏమైందా అని తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా టీఎంసీ నేతలు ‘మా చైర్ పర్సన్ మమతా బెనర్జీకి పెద్దగాయం అయ్యింది. ఆమె నూరుళ్లూ చల్లగా ఉండాలని ప్రార్థించండి’ అంటూ ‘ఎక్స్’ ట్విట్టర్ వేధికగా తెలిపారు. మమతా బెనర్జీ ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. కాకపోతే దీనిపై క్లారిటీ లేదు. ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ లో ఆమెకు చికిత్స కొనసాగుతుంది. 2024 లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయ పడటం ఇది రెండో సారి అంటున్నారు. కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ లో ఆమెను ప్రజలు ప్రేమతో దీదీగా పిలుస్తుంటారు. 

జనవరి నెలలో బర్దమాన్ జిల్లా నుంచి ఆమె తిరిగి వస్తున్న సమయంలో కాన్వాయ్ లోని కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. బర్ధమాన్ నుంచి వస్తున్న సమయంలో తీవ్ర వర్షం పడుతుంది.. ఆ సమయంలో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఆమె ముందుకు ఒరిగిపోయింది. దీంతో తలకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో వెంటనే కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి మమతాకు గాయం కావడంతో టీఎంసీ నేతలు ఆందోళనలో పడ్డారు. ఆమెను బెంగాల్ ఉక్కు మహిళ అంటారు.

 

Show comments