స్మార్ట్ ఫోన్ ద్వారా గంటకు 400 సంపాదిస్తున్న 53 ఏళ్ల మహిళ!

Success Story: సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన నేటి సమాజంలో కూడా చాలా చోట్ల మహిళలపై చిన్నచూపు అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలపై చులకన భావం ఎక్కువగా ఉంటుంది. అలా చూసేవారి నోర్లు మూసిస్తూ.. నలుగురికి ఆదర్శంగా నిలిచింది 55 ఏళ్ల మహిళ. మరి.. ఆమె సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Success Story: సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన నేటి సమాజంలో కూడా చాలా చోట్ల మహిళలపై చిన్నచూపు అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలపై చులకన భావం ఎక్కువగా ఉంటుంది. అలా చూసేవారి నోర్లు మూసిస్తూ.. నలుగురికి ఆదర్శంగా నిలిచింది 55 ఏళ్ల మహిళ. మరి.. ఆమె సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రతి మనిషికీ డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అయితే చాలా మంది తాము చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనంగా వేరే ఇతర పనులు చేస్తూ ఎక్స్ ట్రా డబ్బులను ఆర్జిస్తుంటారు. ఇలా ఎక్కువగా మనకు మగవారే కనిపిస్తుంటారు. కానీ కొందరు మహిళలు కూడా తమ ప్రతిభతో మంచి ఆదాయాన్ని సంపాదిస్తుంటారు. అందరూ స్మార్ట్ ఫోన్ ని తిట్టుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం అదే స్మార్ట్ ఫోన్ తో గంటకు రూ.400 ఆదాయం సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి.. ఆ మహిళ సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఎక్కువ  మంది దృష్టిలో స్మార్ట్ ఫోన్ అంటే ఓ టైమ్ పాస్ సాధనం. అంతేకాక మన విలువైన కాలం వృధా కావడానికి ప్రధాన కారణం ఈ స్మార్ట్ ఫోన్లే అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం స్మార్ట్ ఫోన్ ను సరైన విధంగా వాడితే మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించారు. నేటి ఆధునిక యుగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటే బాగా సంపాదించుకోవచ్చని ఆమె నిరూపించారు. మహారాష్ట్ర లోని పూణేకు చెందిన బేబి రాజారామ్ బోకాలే అనే 55 ఏళ్ల మహిళ.. స్మార్ట్ ఫోన్ తో గంటకు 400 సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. కానీ ఈమెకు వచ్చిన ఐడియా నలుగురి జీవితాలనే  మార్చేసింది. మసాలా దినుసులు, ఎండు మిరపకాయలను గ్రైండింగ్ చేసే  చిన్నపాటి వ్యాపారాన్ని ఆమె నిర్వహిస్తున్నారు. ఈ పని చేస్తూనే  ఆమె ఇప్పుడు ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ కే పాఠాలు చెబుతూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. 

మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన ఏఐ మోడల్స్ కు తన గొంతుని అందిస్తూ  అదనపు డబ్బులను సంపాదిస్తున్నారు.  ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్  అయినా  ‘కార్య’ టీమ్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించారు. 2017లో బెంగళూరు కేంద్రంగా మైక్రోసాఫ్ట్ రిసెర్చి ప్రాజెక్ట్ గా ఈ కార్య  ప్రారంభమైంది. ‘ఎర్న్ లెర్న్ అండ్ గ్రో’ అనే నినాదంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తోంది. కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి, పరిశోధనల కోసం అనేక భారతీయ భాషల్లో డేటా సెట్లను రూపొందిస్తోంది. ఇదే అవకాశాన్ని బేబి రాజారామ్ అందిపుచ్చుకున్నారు.

ఎన్నో లక్షల మంది మరాఠీ మాట్లాడుతున్నప్పటికీ డిజిటల్‌ ప్రపంచంలో ఆ భాషకు సముచిత ప్రాధాన్యత లేదమొ కార్య నిర్వాహకులు  అంటున్నారు. మరాఠీ పైనే కాదు డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా ఉన్న ఎన్నో భాషలపై వారు దృష్టి పెడుతున్నారు. నైపుణ్యాలను (స్కిల్క్‌) వాడుకోవడంతోపాటు పేదరికాన్ని దూరం చేయడానికి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బేబీ రాజారామ్‌ లాంటి సామాన్య మహిళలకు ఆదాయం సంపాదించుకునే మార్గం దొరికింది. పగటి పూట తన పనులన్నీ పూర్తయ్యాక ఏఐ మోడల్స్‌ కోసం ఆమె తన భాషలో స్టోరీలు చదువుతారు. బ్యాంకింగ్, సేవింగ్స్, ఫ్రాడ్‌ ప్రివెన్షన్లకు సంబంధించిన అంశాలను ఇన్‌ఫర్‌మేటివ్, ఎంటర్‌టైనింగ్‌ విధానంలో రూపొందించి అందిస్తున్నారు.

ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తన స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా బేబీ తెలుసుకుంటున్నారు. మరాఠీలో ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. మొత్తం 11 రోజుల్లో ఆమె చేసిన 5 గంటల పనికి 2 వేల రూపాయలు అందుకున్నానని ఆమె తెలిపారు. అంటే ఆమె గంటకు స్మార్ట్ ఫోన్ ద్వారా 400 రూపాయలను సంపాదించినట్టు ఆమె వెల్లడించారు. ఇలా వచ్చిన డబ్బులను తన గ్రైండర్‌ రిపేరింగ్‌  కోసం ఉపయోగించినట్లు బేబీ రాజారామ్ చెప్పుకొచ్చారు. బేబి రాజారామ్ బాటలోనే సురేఖ గైక్వాడ్, రేఖ అనే మరికొందరు మహిళలు కూడా  పయనిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బును ఆ మహిళలు తమ బిడ్డల చదువుల కోసం, తమ కిరాణా సరుకుల కోసం వినియోగిస్తూ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు.

‘కార్య’ పైలట్‌ ప్రాజెక్ట్‌ లో భాగమైన కొద్దిమంది మహిళలకు మొదట్లో స్మార్ట్‌ ఫోన్‌ ఎలా ఉపయోగించాలి అనే దానిపై అసలు అవగాహనే లేదు. అలాంటి వారు కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యపడేలా స్మార్ట్‌ ఫోన్‌ ను అద్భుతంగా ఉపయోగించడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంట్లో ఉండే మహిళలను చిన్నచూపు చేసే వారికి తమ పనితో సమాధానం చెప్పడమే కాకుండా.. ఎంతో మందికి మహిళలకు ఆదర్శంగా నిలిచారు బేబి రాజారామ్, ఆ ప్రాంతంలో ఉండే మరి కొందరు మహిళలు. మరి.. ఉపయోగం లేదని తిట్టుకునే అదే స్మార్ట్ ఫోన్ తో బేబీ రాజారామ్ గంటకు 400 సంపాదిస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments