P Venkatesh
మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందూయేతరులు దేవాలయాల్లోకి ప్రవేశించకూడదని.. వారి ప్రవేశాన్ని నిషేదించాలని సంచలన తీర్పు చెప్పింది. దేవాలయాలు పిక్నిక్ స్పాట్ కాదంటూ ఫైర్ అయ్యింది.
మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందూయేతరులు దేవాలయాల్లోకి ప్రవేశించకూడదని.. వారి ప్రవేశాన్ని నిషేదించాలని సంచలన తీర్పు చెప్పింది. దేవాలయాలు పిక్నిక్ స్పాట్ కాదంటూ ఫైర్ అయ్యింది.
P Venkatesh
ఏ మతానికి చెందిన వారైనా దేవుడిని పూజించడం సహజం. భారతదేశం సర్వ మతాలకు పుట్టినిల్లు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. ఈ మధ్య కాలంలో మతాలకు అతీతంగా దేవుళ్లను పూజిస్తున్నారు. ఇటీవల అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభం కాగా ఓ ముస్లి యువతి కాలినడకన అయోధ్యకు చేరుకుంది. అదే విధంగా మరికొంత మంది ముస్లింలు హిందూ దేవాలయాల్లో పూజలు చేయడం చూశాం. ఇలా ఏదో ఓ ప్రాంతంలో మత సామరస్యం వెల్లువిరుస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందూయేతరులు దేవాలయాల్లోకి ప్రవేశించకూడదని.. వారి ప్రవేశాన్ని నిషేదించాలని సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పు సందర్బంగా పలు సంచలన విషయాలను కోర్టు పేర్కొంది.
దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధించాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. దేవాలయాల్లో హిందూయేతరులు ధ్వజస్తంభం దాటి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించాలని తెలిపింది. అదేవిధంగా హిందూ దేవాలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేదిస్తూ బోర్డులు పెట్టాలని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖను మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దేవాలయాలంటే విహారయాత్రకు సంబంధించిన ప్రదేశం కాదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులకు కూడా తమ మతాన్ని విశ్వసించే, అనుసరించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.
డి.సెంథిల్ కుమార్ అనే వ్యక్తి హిందూ దేవాలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేదించాలని, దీనికి సంబంధించిన సూచిక బోర్డులను పెట్టాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు మధురై బెంచ్‌లోని జస్టిస్ ఎస్ శ్రీమతి దీనిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాల ప్రవేశద్వారం వద్ద హిందూయేతరులు ధ్వజస్తంభం దాటి ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపే బోర్డులు పెట్టాలని ఆదేశించింది. అదేవిధంగా హిందుయేతర వ్యక్తి ఆలయాన్ని సందర్శించినపుడు.. తనకు దేవుడిపై నమ్మకం ఉందని, హిందూమతాచారాలు పాటిస్తానని అతడి నుంచి అధికారులు అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది. మరి మద్రాస్ హైకోర్టు దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.