Arjun Suravaram
ఎవరికైనా కష్టాల్లోంచే కసి పెరుగుతుంది. నీటిలో నుంచి కమలం వికసించినట్లుగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఎంతటి కష్టమైనా నిరాశ పడకుండా సంక్లిష్ట సమయంలోంచే విజయాన్ని అందుకుంటారు. అలానే ఓ మహిళ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్ని నలుగురు ఆదర్శంగా నిలిచింది.
ఎవరికైనా కష్టాల్లోంచే కసి పెరుగుతుంది. నీటిలో నుంచి కమలం వికసించినట్లుగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఎంతటి కష్టమైనా నిరాశ పడకుండా సంక్లిష్ట సమయంలోంచే విజయాన్ని అందుకుంటారు. అలానే ఓ మహిళ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్ని నలుగురు ఆదర్శంగా నిలిచింది.
Arjun Suravaram
జీవితంలో గొప్ప స్థాయిలో ఉన్న వారు అందరూ గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలా లైఫ్ లో వచ్చే కష్టాలల్లో నుంచి కసి పెరిగి విజయానికి బాటలు వేస్తుంది. అలా కేవలం మగవారు మాత్రమేకాదు. ఎంతో మంది ఆడవాళ్లు చదువుతో సంబంధంలేకుండా తమ తెలివితో వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ఎంతటి కష్టమైనా నిరాశ పడకుండా క్లిష్ట పరిస్థితుల్లోంచి విజయాన్ని వెదుక్కుంటారు. అలా విజయం సాధించిన వారే వారే చరిత్రలో నిలిచి పోతారు. అలాంటి స్ఫూర్తి దాయకమైన ఓ మహిళ విజేత గురించి తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ లోని ఝబువార అనే చిన్నపట్టణానికి చెందిన మహిళ సంతోష్ వసునియా. తన కుటుంబంతో కలిసి ఆ చిన్న పట్టణంలో నివసించేంది. కోవిడ్ సంక్షోభం కాలంలో పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన అనేకమంది వలస కార్మికులు గ్రామాల బాట పట్టారు. అలాంటి కుటుంబాల్లో సంతోష్ వసునియా ఫ్యామిలీ కూడా ఒకటి. అలా అందరూ కరోనా దెబ్బకు ఆర్థికంగా అల్లాడిపోతున్న సమయంలోనే వసునియా ధైర్యంగా ముందడుగు వేసింది. సొంతంగా తన కాళ్లమీద తాను నిలబడాలనే బలంగా కోరుతుంది. తన లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు అడుగులు వేసింది.
ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని బాగా సంపాదించాలని, అలానే నలుగురు ఉపాధి ఇవ్వాలని అనుకుంది. అయితే వసునియా కుటుంబంలో ఎవరు వ్యాపారం చేసిన వారు లేరు. అలా కుటుంబంలో ఎలాంటి వ్యాపార వారసత్వం లేక పోయినా ఆమె ఎంతో ధైర్యంగా ముందడగు వేసింది. ఈ క్రమంలో కొందరు సంతోష్ ని అధైర్యానికి గురి చేశారు. అయిన వెనుకడుగు వేయకుండా తాను ముందుకు సాగింది. ఆడవారికి ఎంతో ముఖ్యమైన, వారిని ఎక్కువగా ఆకట్టుకునే సౌందర్య ఉత్పత్తుల గురించి వ్యాపారం చేయాలని ఆమె మదిలో మెదిలింది. ఆలోచన అయితే వచ్చింది కానీ.. ఆ వ్యాపారం ప్రారంభించేంత పెట్టుబడి ఆమె వద్ద లేదు. సంతోష్ వసునియ వద్ద కేవలం దగ్గర లక్ష రూపాయలు మాత్రమే. కష్టాల నుంచి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని పెద్దలు అంటారు.
అదే విధంగా తనకు వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు సంతోష్ వసునియా ఆలోచనలు చేసింది. ఇదే సమయంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ స్కీమ్ గురించి తెలిసింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) గురించి తెసుకుంది. ఈ పథకం గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యాపారం ప్రారంభించి.. స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు లక్ష నుంచి 50 లక్షల రూపాయల వరకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పీఎంఈజీపీ స్కీమ్ ద్వారా సంతోష్ వసునియా రూ. 3.75 లక్షలు సాయాన్ని పొందింది.
ఇక ఆ రుణంతో సౌందర్య ఉత్పత్తుల తయారీ రంగాన్ని ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే స్థానికంగా మంచి గుర్తింపు సంపాందించింది. రిఫ్రెష్‌మెంట్స్, సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్స్ వ్యాపారంలో సత్తా చాటుకుంటోంది. తాను సక్సెస్ కావడమే కాకుండా స్థానికంగా ఉండే పలువురు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇక తన వ్యాపార రంగంలో వసునీయ కీలక విషయాలను వెల్లడించింది. ఆమె నాలుగేళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. అంతేకాక వసునియా పదవ తరగతి వరకే చదివింది అంట. వాళ్ల అమ్మ రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాని పోషించింది.
తన తల్లి కష్టాలను వసునియా దగ్గర నుంచి చూసింది. ఈక్రమంలో చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకుంది. ఆతరువాత భర్త, పిల్లల అనే సంసారం జీవితంలో బిజీ అయింది. చివరకు 44 ఏళ్ల వయసులో వ్యాపారం చేయాలనే ఆమె వ్యాపారానికి ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా (TRI) ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటేషన్ హబ్ వారు సాయం చేశారని సంతోష్ వసునియా తెలిపింది. సంతోష్ వసునియా లాగా ఎంతో మంది సంసారం జీవితంలోనే ఉండిపోతుంటారు. వ్యాపారం చేయాలని కోరిక ఉన్నా ధైర్యం చేయలేరు. అలాంటి వారందరికి సంతోష్ వసునియా ఆదర్శంగా నిలిచారు. మరి.. ఈ మహిళ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.