వీడియో: బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన యువ జంట

ఈ మధ్యకాలంలో ప్రేమలో ఉన్న యువతీయువకులు ప్రవర్తిస్తున్న తీరు ముక్కున వేలేసుకునే విధంగా ఉంటున్నాయి. మామూలుగా ప్రేమికులు ఏకాంతంగా ఉండడం కోసం పార్కులకు, సినిమాలకు, ఎవరు లేనటువంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. తమ గుట్టు బయటపడకుండా ఉండే విధంగా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎవరు ఏమనుకుంటే మాకేంటీ అంటూ బహిరంగంగానే రొమాన్స్ కు తెరలేపుతున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో మరో జంట రన్నింగులో ఉన్న బైక్ పై రొమాన్స్ చేస్తూ, ఘాటు ముద్దులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన జనం ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవలి కాలంలో కొన్ని ప్రేమ జంటలు కదిలే బైక్ పై ముద్దులు పెట్టుకుంటూ రోడ్లపై హల్ చల్ చేసిన సంఘటనలు చాలా చోట్ల చోటుచేసుకున్నాయి. తాజాగా రాజస్థాన్ లో మరో జంట బైక్ పై ప్రయాణిస్తూ ముద్దుల్లో మునిగి తేలారు. పబ్లిక్ తిరిగే ప్లేస్ లో ఉన్నామన్నా సోయి లేకుండా రొమాన్స్ తో రెచ్చిపోయారు. ప్రమాదకర పరిస్థితిలో బైక్ నడుపుతూ వెనకాల కూర్చున్న యువతికి ముద్దులిస్తూ రెచ్చిపోయాడు యువకుడు. ముద్దులతో రెచ్చిపోయిన ఈ లవ్ బర్డ్స్ ను వీరి వెనకాల వెళ్తున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన అక్కడి ట్రాఫిక్ పోలీసులు టూ వీలర్ నెంబర్ ఆధారంగా ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Show comments