P Venkatesh
Madras High Court: మీరు మీ లవర్ ని హగ్, కిస్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?
Madras High Court: మీరు మీ లవర్ ని హగ్, కిస్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?
P Venkatesh
లవ్ లో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చేయడానికి నానా హైరానా పడుతుంటారు. ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తూ.. తియ్యటి కబుర్లు చెప్తూ అటెన్షన్ అంతా తన మీదే ఉండేలా చేస్తుంటారు. రోజంతా ప్రేయసీ గురించే ఆలోచిస్తుంటారు. తన నుంచి కాల్స్, మెసేజెస్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు ప్రియురాలిని కలుద్దామా అని వెయిట్ చేస్తుంటారు. ప్రియురాలి చెంతకు చేరగానే తన ఒడిలో సేదా తీరాలని చూస్తుంటారు. లవర్ ను హగ్ చేసుకుంటారు. ముద్దులతో ముంచెత్తుతుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు ఇదంతా కామన్ గా జరిగే తంతే. కానీ, లవర్స్ మధ్య ఏవైనా మనస్పర్ధలు చోటుచేసుకున్నప్పుడు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.
హగ్ లు, కిస్ లను కారణాలుగా చూపి ప్రియుడిపై కేసులు పెట్టే ఛాన్స్ లేకపోలేదు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువకుడిపై 19 ఏళ్ల యువతి తనను హగ్ చేసుకున్నాడని, కిస్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి, యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ఇష్టప్రకారమే అన్యోన్యంగా గడిపారు. పీకల్లోతు ప్రేమలో విహరించారు. కొంతకాలం తర్వాత వీరి ప్రేమలో అలజడి రేగింది. అభిప్రాయ బేధాలతో విడిపోయారు. కాగా ఆ యువతి ప్రియుడిపై కక్ష పెంచుకుని ఇబ్బందులకు గురిచేయాలని చూసింది.
దీనిలో భాగంగానే యువతి తన ప్రియుడిపై తనను ముద్దు పెట్టుకున్నాడని, హగ్ చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు కాస్త మద్రాస్ హైకోర్టు వరకు చేరింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమలో ఉన్నపుడు ప్రేమికులు ఒకరినిఒకరు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం సాధారణమే అని హైకోర్టు తెలిపింది. వీటిని లైంగిక నేరాలుగా పరిగణించి ఆ యువకుడిని దోషిగా తేల్చలేమని స్పష్టం చేసింది. ప్రేమికుల మధ్య కిస్ లు, హగ్ లు నేరం కాదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్.. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద వీటిని నేరాలుగా పరిగణించడం కుదరదని తీర్పును వెల్లడించింది.
తాము ప్రేమలో ఉన్నపుడు ఒక రోజు రాత్రి తాము ఇద్దరం కలుసుకున్నామని.. అయితే ఆ సమయంలో ఆ యువకుడు.. తనను ముద్దులు పెట్టుకున్నాడని.. హగ్ కూడా చేసుకున్నాడని.. యువతి చేసిన ఫిర్యాదును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడం, శారీరకంగా వాడుకోవడం చట్ట ప్రకారం నేరమని స్పష్టం చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా హగ్‌లు, కిస్‌లు పెట్టుకుని గొడవల కారణంగా విడిపోయి కేసులు పెట్టడం సరికాదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ఏకాభిప్రాయంతో కిస్ లు, హగ్ లు నేరం కాదని కోర్టు చెప్పింది కాబట్టి యువకుడు జైలుపాలు కాకుండా బయటపడ్డాడు. లేదంటే లైఫ్ రిస్క్ లో పడేది. మరి మీరు కూడా మీ లవర్ కు హగ్ లు కిస్ లు ఇస్తున్నారా? మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమో జాగ్రత్త.