iDreamPost
android-app
ios-app

4 నెలలకే పెళ్లి.. బాల్య వివాహంపై యువతి పోరాటం.. చివరకు ఏమైందంటే?

Anita child marriage: బాల్య వివాహంపై ఓ యువతి పోరాటం చేసింది. 4 నెలల వయసులో పెళ్లి జరుగగా 20 ఏళ్ల వయసులో విముక్తి పొందింది. బాల్యవివాహంపై ఆ యువతి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

Anita child marriage: బాల్య వివాహంపై ఓ యువతి పోరాటం చేసింది. 4 నెలల వయసులో పెళ్లి జరుగగా 20 ఏళ్ల వయసులో విముక్తి పొందింది. బాల్యవివాహంపై ఆ యువతి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

4 నెలలకే పెళ్లి.. బాల్య వివాహంపై యువతి పోరాటం.. చివరకు ఏమైందంటే?

వివాహం ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. యుక్త వయసు వచ్చిన యువతీ యువకులు వివాహం కోసం ఎన్నో కలలుకంటుంటారు. తమకు కాబోయే భర్త, భార్య ఇలా ఉండాలని భావిస్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటారు. ఓ ఇంటివాళ్లను చేసి తమ బాధ్యతలను తీర్చుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు తమ కూతురుకు వివాహం చేశారు. కానీ, అది బాల్యవివాహం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏటంటే? ఆమె పుట్టిన 4 నెలల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ యువతికి 21 ఏళ్లు. తనకు ఊహ తెలియని వయసులో పెళ్లి జరిపించారని బాల్య వివాహంపై యువతి పోరాటం చేసింది.

మరి ఈ పోరాటంలో ఆ యువతి విజయం సాధించిందా? తన భవిష్యత్తు కోసం చేసిన పోరాటంలో సక్సెస్ అయ్యిందా లేదా? అసలు చివరికి ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాల్య వివాహాలు నేరమని హెచ్చరిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే పెళ్లిల్లు చేసి అత్తారింటికి పంపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. బాల్య వివాహాలను కోర్టులు రద్దు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు మాత్రం రావడం లేదు. దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాలను నిరోధించే చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు 4 నెలల వయసులోనే పెళ్లి చేశారు. 15 ఏళ్లు వచ్చేసరికి అత్తమామలు కాపురానికి పంపాలని ఒత్తిడి చేశారు. అయితే తనకు ఊహ తేలిసేనాటికి పెళ్లైపోయిందని తెలిసిన ఆమె.. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసింది. చివరకు విజయం సాధించింది. కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేయడమే కాదు.. న్యాయపోరాటానికైన మొత్తం ఖర్చులను అత్తింటివారే భరించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోధ్‌పూర్‌కు చెందిన అనిత (21)కు నాలుగు నెలల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ తర్వాత యువతికి 15 ఏళ్లు వచ్చే వరకు తల్లిగారింట్లోనే పెరిగింది. ఈ క్రమంలోనే తమ కోడలిని కాపురానికి పంపించాలని అత్తమామలు ఒత్తిడి తీసుకొచ్చారు.

కాగా ఈ పెళ్లిని అనిత వ్యతిరేకించింది. ముక్కుపచ్చలారని వయసులో పెళ్లి చేశారని.. తాను కాపురానికి రానని తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు సర్థిచెప్పినా వినలేదు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ పోరాటంలో ఆమెకు సోదరి, సోదరుడు అండగా నిలిచారు. స్వచ్ఛంద సంస్థ సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కృతి భారతి సహకారంతో బాల్య వివాహాంపై కోర్టును ఆశ్రయించింది. కాగా, అనిత నిర్ణయాన్ని మొదట్లో ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించినా.. కృతి భారతి కౌన్సెలింగ్‌తో కుమార్తెకు మద్దతుగా నిలిచారు. సోమవారం జోధ్‌పూర్‌ కుటుంబ న్యాయస్థానం జడ్జి వరుణ్ తల్వార్ బాల్య వివాహన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.

అంతేకాదు కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్త, మామలను ఆదేశించారు. బాల్య వివాహాలు నేరమని, బాల్య వివాహాల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జడ్జి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాల్య వివాహంపై పోరాటం చేసిన అనిత 21 ఏళ్ల వయసులో విముక్తి పొందింది. తన భవిష్యత్తుకు తానే బాటలు వేసుకుంది. బాల్య వివాహాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తన పోరాటంతో వారిలో కొండంత ధైర్యాన్ని నింపింది. మరి బాల్య వివాహంపై అనిత చేసిన పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.