iDreamPost
android-app
ios-app

Lok Sabha Security Breach: లోక్ సభలో దాడి నిందితులు ఎవరు? ఎందకు చేశారు? పూర్తి వివరాలు!

లోక్ సభలో దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన అదే రోజు 222 ఏళ్ల తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..

లోక్ సభలో దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన అదే రోజు 222 ఏళ్ల తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..

Lok Sabha Security Breach: లోక్ సభలో దాడి నిందితులు ఎవరు? ఎందకు చేశారు? పూర్తి వివరాలు!

2001 డిసెంబర్ 13న పార్లమెంట్ పై ఉగ్రమూక దాడికి దిగింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత అదే రోజున లోక్ సభలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. జీరో అవర్ సమయంలో ఇద్దరు ఆగంతుకులు లోక్ సభలోకి ప్రవేశించి పొగ బాంబులతో హల్చల్ చేశారు. ఈ ఘటనతో పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ దాడి ఘటనలో జరిగింది ఏంటి? ఈ యువకులు ఎవరు అనే విషయాలను చూద్దాం.

దాడి ఎలా జరిగింది?:

లోక్ సభలో జీరో అవర్ నడుస్తున్న సమయంలో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము ప్రసింగిస్తున్ నసమయంలో ఈ ఘటన జరిగింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఒక యువకుడు సభలోకి ప్రవేశించాడు. అతడిని చూసిన ఎంపీలు మొదట అతను గ్యాలరీ నుంచి కిందపడిపోయాడు అంటూ భావించారు. ఆ తర్వాత మరో యువకుడు కూడా గ్యాలరీ వద్ద వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత ఏదో జరగబోతోందని గ్రహించిన ఎంపీలు అప్రమత్తం అయ్యారు. ఆలోపే ఆ యువకుడు కుర్చీలు, బల్లల మీదకు ఎక్కుతూ స్పీకర్ కుర్చీవైపు పరుగులు పెడుతున్నాడు. అతడిని ఎంపీలు అందరూ చుట్టుముట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఆ యువకుడి చేతులు పట్టుకుని అతడిని అదుపు చేశాడు. ఆ సమయంలోనే షూలో దాచుకున్న స్మోక్ బాంబుని ఆ యువకుడు బయటకు తీశాడు. అప్పుడు సభలో పసుపు రంగులో దట్టమైన పొగ వచ్చింది. ఆ సమయంలో ఎంపీలు కొంత కంగారు పడ్డారు.

వెంటనే మార్షల్స్ వచ్చి ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. సభలోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు సాగర్ శర్మ(మైసూర్ ), మనోరంజన్(మైసూర్) గా భద్రతా సిబబంది గుర్తించింది. వీళ్లు లోపల దాడికి దిగితే వీరికి మద్దతుగా పార్లమెంట్ బయట ఒక యువతి, మరో యువకుడు కూడా హంగామా సృష్టించారు. వారితో తెచ్చుకున్న స్మోక్ బాంబులను ప్రయోగించారు. పసుపు, ఎరుపు రంగుల్లో పొగతో పార్లమెంట్ ప్రాంగణంలో కాసేపు ఆందోళన నెలకొంది. ఆ యువతి పేరు నీలమ్ కౌర్(హిస్సార్- హర్యానా), మూడో యువకుడి పేరు అమోల్ షిండే(లాతూర్- మహారాష్ట్ర) గా గుర్తించారు. లోక్ సభలోకి ప్రవేశించిన సాగర్, మనోరంజన్ ఇద్దరూ మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో పాస్ తీసుకుని ప్రవేశించారు. ఈ ఇద్దరు యువకులు మైసూర్ లోని వివేకానంద ఇన్ స్టిట్యూట్ లో చదువుతున్నారు.

వీళ్లు నలుగురు కలిసే ఈ దాడికి పాల్పడినట్లు ధృవీకరించారు. వీళ్లు కొన్నినినాదాలు చేశారు. “రాజ్యాంగాన్ని కాపాడాలి.. నియంతృత్వం చెల్లదు” అంటూ నినాదాలు చేశారు. సాగర్ శర్మ, మనోరంజన్.. బెంగళూరు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి ఢిల్లీ చేరుకున్నట్లు గుర్తించారు. వీళ్ల నలుగురిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి గురించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నలుగురు గురించి పూర్తి వివరాలు సేకరించేందుకు.. వీరి దాడి వెనుకనున్న లక్ష్యం తెలుసుకునేందుకు.. వారి స్వస్థలాలకు సిబ్బందిని కూడా పంపారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అయితే ఈ స్మోక్ ఎలాంటి ప్రమాదకరం కాదని నిర్ధారణకు వచ్చారు.

ఓం బిర్లా సీరియస్:

ఈ దాడి ఘటనతో పార్లమెంటులో విజిటర్స్ పాస్ లను రద్దు చేశారు. ఈ భద్రతా వైఫల్యం, దాడి ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. భద్రతా సిబ్బందిని ఈ ఘటనపై పూర్తి నివేదికను సిబ్బందిని కోరారు. అలాగే అన్ని పార్టీల నుంచి కొందరు నేతలతో అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ ఘటనను తేలిగ్గా తీసుకోకూడదనే విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఈ ఘటనపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ కోరారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. “ఇది కేవలం లోక్ సభ- రాజ్యసభకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. అసలు ఇద్దరు వ్యక్తులు ఎలా లోపలకి రాగలిగారు. భద్రతా వలయాన్ని ఎలా ఛేదించగలిగారు? సభను వాయిదా వేద్దాం. హోమంత్రిని రానివ్వండి. మరిన్ని వివరాలు ఇవ్వమని చెప్పండి” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పియూష్ గోయల్ మాట్లాడుతూ.. “నాకు తెలిసి రాజ్యసభ అంటే పెద్దలతో నిండిన సభ. మనం ఒక సందేశాన్ని ఇద్దాం. వీటన్నింటి కంటే మన దేశం ఎంతో బలమైనది అని. కాంగ్రెస్ దీనిని రాజకీయం చేయాలని చూస్తోంది. ఇది దేశానికి సరైన సందేశాన్ని ఇవ్వదు” అంటూ పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. లోక్ సభలో దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.