Keerthi
ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్ పై ఎల్పిజి సిలిండర్ ను పెట్టి భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఈసారి ట్రాక్ కు అడ్డంగా 6 మీటర్ల ఇనుప స్తంభం వేశారు.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్ పై ఎల్పిజి సిలిండర్ ను పెట్టి భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఈసారి ట్రాక్ కు అడ్డంగా 6 మీటర్ల ఇనుప స్తంభం వేశారు.
Keerthi
ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదాలు చూస్తుంటే రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.అయితే ఈ ప్రమదాలు అనేవి సాంకేతిక లోపాలు,సిగ్నల్స్ తప్పిదాలు కొన్ని అయితే, మరి కొన్నిమానవ ఆకతాయిలు చేస్తున్న చర్యల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్ పై ఎల్పిజి సిలిండర్ ను పెట్టి భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. దీంతో భారీ రైలు ప్రమాదం తప్పిందంటూ రైల్వేశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఉత్తరాఖండ్‌లోని లోని లోకో పైలట్ అప్రమత్తతతో మరోసారి ఘోర రైలు ప్రమాదం తప్పింది. బిలాస్‌పూర్ రోడ్ – రుద్రపూర్ సిటీ మధ్య ప్రయాణిస్తున్న జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కు అడ్డంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 6 మీటర్ల ఇనుప స్తంభాన్ని అడ్డంగా పెట్టారు. దీంతో ఆ ఇనుప స్తంభాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పిది. అనంతంరం ఆ స్తతంభాన్ని పట్టాలపై నుంచి తొలగించి ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం యాథావిధిగా రైల్లను నడపడం కొనసాగించారు. ఇకపోతే ఈ ఘటన బుధవారం సెప్టెంబర్ 18 న రాత్రి 10.18 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రపూర్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినట్లు సమాచారం.
అయితే ఈ ఘటన పై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) పోలీసు అవుట్‌పోస్ట్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా.. రుద్రపూర్ సిటీ సెక్షన్ రైల్వే ఇంజనీర్ రాజేంద్ర కుమార్ ఫిర్యాదుపై, రైల్వే చట్టం 1989లోని సెక్షన్ల కింద పేరు తెలియని వ్యక్తులపై GRP పోలీస్ స్టేషన్ రాంపూర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే పట్టాలపై అడ్డంగా సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలు ఉంచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై రైల్వే అధికారుల స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ, మళ్లీ ఇనుప స్తంభాన్ని అడ్డంగా పెట్టి మరో రైలు ప్రమాదానికి గురయ్యే చేయడం పై అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరి, రైలు కు అడ్డంగా ట్రాక్ పై ఇనుప స్తంభాన్ని వేసిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.