కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. CM పదవికి రాజీనామా! అసెంబ్లీ రద్దు?

CM Aravind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన తీహార్ జైలుకు వెళ్లిన తర్వాత పలు కీలక పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

CM Aravind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన తీహార్ జైలుకు వెళ్లిన తర్వాత పలు కీలక పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేజ్రీవాల్ కి షరతులు విధించింది. తాజాగా సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ఆప్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రాజీనామా తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తానని.. ఇంటింటికీ వెళ్లి ప్రజా తీర్పు కోరుతానని అన్నారు. ప్రజలు తను తిరిగి గెలిపిస్తే.. తాను నిర్దోషినే అన్నట్లే అన్నారు. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు.

ఇక నుంచి నేను న్యాయపోరాటం చేయబోతున్నాను. ప్రజా కోర్టులో న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను.. ప్రజల ఆమోదంతోనే నేను సీఎం పదవికి చేపడతాను. తన స్థానంలో వేరొకరు సీఎంగా బాధ్యతలు చేపడతారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ కి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.. అయితే నవంబర్ లోనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Show comments