nagidream
ISRO Good News To Students: విద్యార్థులకు ఇస్రో అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇస్రోతో పాటు కలిసి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతరిక్ష పరిశోధకులతో కలిసి ట్రావెల్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా..
ISRO Good News To Students: విద్యార్థులకు ఇస్రో అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇస్రోతో పాటు కలిసి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతరిక్ష పరిశోధకులతో కలిసి ట్రావెల్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా..
nagidream
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024లో భాగంగా ‘భారతీయ అంతరిక్ష హ్యకథాన్’ ని ప్రారంభించింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి ఏటా ఆగస్టు 23న జరుపుకుంటారు. ఇందులో భాగంగా భారతీయ విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో పోటీని నిర్వహిస్తుంది. అంతరిక్ష సంబంధిత ఛాలెంజెస్ ని అధిగమించేందుకు ఈ పోటీని నిర్వహిస్తుంది. ఈ హ్యకథాన్ లో జీఈఓ స్పేషియల్ అప్లికేషన్స్ మీద 12 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేందుకు ముగ్గురు లేదా నలుగురు భారతీయ విద్యార్థుల బృందాలను ఆహ్వానిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పీహెచ్డీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ ఈ పోటీలో పాల్గొనవచ్చు. వెబ్ పోర్టల్ ద్వారా రెండు దశల కఠిన స్క్రీనింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది.
ఈ స్క్రీనింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఇస్రో వివరించింది. తొలుత విద్యార్థుల ఆలోచనలు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కి సంబంధించి 100 బృందాలను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ వంద బృందాల నుంచి నిపుణుల కమిటీ 30 బృందాలను గ్రాండ్ ఫినాలేకి ఎంపిక చేస్తుంది.
అప్లికేషన్ డ్రివెన్ ఎకో సిస్టమ్స్ ని ఎక్కువగా క్రియేట్ చేసేందుకు, అంతరిక్ష ఆధారిత అప్లికేషన్స్ లో ఆవిష్కరణలు తీసుకొచ్చేందుకు ఈ హ్యకథాన్ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. ఈ ప్రోగ్రాం వల్ల సమాజానికి, దేశానికి ప్రయోజనం చేకూర్చుతుంది అన్నారు. ఈ హ్యకథాన్ నుంచి వచ్చే వినూత్న ఆలోచనలు సక్సెస్ ఫుల్ బిజినెస్ మోడల్స్ గా పరిణామం చెందుతాయని అన్నారు.