స్వాతంత్య్ర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్ర భగ్నం! వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్..

ISIS Terrorist Arrest: ఏటా మాదిరిగానే ఈసారి కూడా స్వాతంత్య్ర వేడుకల దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ ఉగ్ర కుట్రను  పోలీసులు భగ్నం చేశారు. మెస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు.

ISIS Terrorist Arrest: ఏటా మాదిరిగానే ఈసారి కూడా స్వాతంత్య్ర వేడుకల దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ ఉగ్ర కుట్రను  పోలీసులు భగ్నం చేశారు. మెస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు.

ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల కృషి ఫలితంగా మనం నేడు స్వేచ్చా వాయువులను పీలుస్తున్నాము. వారి త్యాగఫలంతోనే స్వతంత్ర భారత దేశంలో జీవిస్తున్నాము. ఏటా ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటాము. అలానే ఈ సారి కూడా దేశమంతా పంద్రాగష్టు వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో ఉగ్రవాదులు, వారి సంస్థలు దేశంలో విధ్వసం సృష్టించే కుట్రలు పనుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఈ ఏడాది కూడా స్వాతంత్య్ర వేడుకల దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ ఉగ్ర కుట్రను  పోలీసులు భగ్నం చేశారు. పరారీలో ఉన్న మోస్ట్ వాటెండ్ ఐసీసీ తీవ్రవాది ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు దిల్లీ పోలీసులు శుక్రవారంవెళ్లడించారు. ఇక అరెస్టైన ఉగ్రవాది గురించి కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీలోని దర్యాగండ్ నివాసి అయిన రిజ్వాన్ అబ్ధుల్ హజీ అలీ ఐసీసీ పుణె ప్రాంతంలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడిపై ఇప్పటికే జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రూ.3 లక్షల రివార్డును కూడా ప్రకటించి ఉంది. గురువారం రాత్రి ఢిల్లీలోని తుగ్లకాబాద్ లోని బయోడైవర్సిటీ పార్క్ వద్దకు రిజ్వాన్ వస్తాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన స్పెషల్ టీమ్ కి చెందిన పోలీసులు అత్యంత చాకచక్యంగా ఆ ఉగ్రవాదిని ట్రాప్‌ చేసి పట్టుకున్నారు. రిజ్వాన్ నుంచి పిస్టోల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.అంతేకాక రెండు ఫోన్లను సీజ్‌ చేసింది. వాటి నుంచి డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్వాతంత్య్ర వేడుకల వేళ ఢిల్లీ రిజ్వాన్ రావడం కలకలం రేపింది. ఇప్పటికే దిల్లీలోని పలు వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్‌, అతడి అనుచరులు పలుమార్లు రెక్కీ చేసినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు వేళ వీరు ఉగ్రదాడులకు కుట్రలు ప్లాన్లు వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రవాది అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అంతేకాక ఆగష్టు 15న వేడుకల నేపథ్యంలో భద్రతా విషయంలో పోలీసు అధికారులకు ఉన్నతాధికారుల నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో కూడా ఇలాంటి ఉగ్రకుట్రలను పోలీసులు అధికారులు భగ్నం చేశారు. అలానే పలు రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

Show comments