P Venkatesh
ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో ఓ పోలింగ్ ఏజెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్లను మించిన క్రేజ్ తో ఇంటర్ నెట్ సెన్సేషన్ గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో ఓ పోలింగ్ ఏజెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్లను మించిన క్రేజ్ తో ఇంటర్ నెట్ సెన్సేషన్ గా మారింది.
P Venkatesh
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న సంఘటన అయినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. సోషల్ మీడియా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. స్పెష్ టాలెంట్ తో రీల్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఓ పోలింగ్ ఏజెంట్ మాత్రం కేవలం తన బ్యూటీతో ఇంటర్ నెట్ సెన్సేషన్ గా మారింది. నెటిజన్స్ అంతా ఆమె ఎవరా అని తెగ వెతికేస్తున్నారు. ఆమె మరెవరో కాదు ఇషా అరోరా అనే పోలింగ్ ఏజెంట్. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోరు మొదలైంది. శుక్రవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఎన్నికల విధులు నిర్వహించిన ఈమె అందరి దృష్టిని ఆకర్షించారు.
ఉత్తరప్రదేశ్‌లోని సహరణ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో ఇషా అరోరా పోలింగ్ ఏజెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఓటింగ్‌కు ముందు ఇషా అరోరా ఈవీఎం బాక్సులు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలింగ్ ఏజెంట్ గా తళుక్కుమన్న ఈ బ్యూటీ ఎవరబ్బా అంటూ ఇంటర్నెట్ లో జల్లెడ పడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఎవరంటే?
ఇషా అరోరా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది. గతంలో కూడా రెండు పర్యాయాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. విధుల్లో ప్రతిఒక్కరికీ క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని, అది ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని సూచించారు. ఇవి పాటించడం వల్లే ఎన్నికల విధుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదన్నారు. సోషల్ మీడియాలో స్టార్ లను మించిన క్రేజ్ రావడంతో అంతా హీరోయిన్ ఏమో అనుకున్నారు. చివరకు ఆమె పోలింగ్ ఏజెంట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
#WATCH | Saharanpur, UP: Polling Agent Isha Arora says, “I think that if you get any duty, you should be punctual and that’s the reason I have assumed my duty on time. Every man and woman should be punctual to let the functioning be smooth.”
Regarding her video going viral, she… pic.twitter.com/Xo44vVeYyQ
— ANI (@ANI) April 19, 2024