iDreamPost
android-app
ios-app

ఆ విషయాన్ని దాచి పెళ్లికి సిద్దమైన వ్యక్తి! బండారం బయటపడడంతో..!

ఆ విషయాన్ని దాచి పెళ్లికి సిద్దమైన వ్యక్తి! బండారం బయటపడడంతో..!

ఈ మధ్యకాలంలో పెళ్లి పేరుతో ఎంతో మంది కేటుగాళ్లు అమాయక యువతులను నిండా ముంచేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోని వారు కొందరైతే.. అబద్ధాలు చెప్పి తాళికట్టే వాళ్లు మరి కొందరు. ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చాలా మంది బాధితులు పెళ్లయ్యాక అసలు విషయాన్ని తెలుసుకుంటున్నారు. చివరికి చేసేదేం లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఆ విషయాన్ని దాచి ఓ యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఇక పెళ్లి రోజే మండపంలో అసలు విషయం బయటకు రావడంతో వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఆ యువకుడిని చితక్కొట్టారు. అసలేం జరిగిందంటే?

బీహార్ గయా డోఢీ పరిధిలోని బజౌరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. వధువు, వరుడుతో పాటు ఇరువరి బంధువులు అంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు. మరి కొద్దిక్షణాల్లో పెళ్లి అనగా.. వధువు కుటుంబ సభ్యులకు వరుడి ప్రవర్తనపై కాస్త అనుమానం కలిగింది. బట్టతల ఉన్న విషయాన్ని దాచి పెళ్లికి సిద్దమయ్యాడని అంతా గ్రహించారు. వెంటనే అతని తలపై ఉన్నవి నిజమైన వెంట్రుకలు కాదా అని పరిశీలించారు. మొత్తానికి అది విగ్గు అని తెలిసిపోయింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఇతని అప్పుడే పెళ్లైన విషయాన్ని కూడా దాచి రెండవ పెళ్లికి సిద్దపడినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. అతని బండారం బయటపడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో కోపంతో అందరూ కలిసి అతడిని చితక్కొట్టారు. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: పేరుకే స్పా సెంటర్.. లోపల అమ్మాయిలతో..!