Alok Sagar: RBI గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి.. కోట్ల ఆస్తి! అన్నీ వదిలేసి ఇలా!

ఓ వ్యక్తి జీవిత కథ అందరికీ ఆదర్శంగా ఆశ్చర్యంగా ఉంటుంది. తనపేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్న ఓ వ్యక్తి.. వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అతడెవరూ? అతని నేపథ్యం ఏంటంటే..

ఓ వ్యక్తి జీవిత కథ అందరికీ ఆదర్శంగా ఆశ్చర్యంగా ఉంటుంది. తనపేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్న ఓ వ్యక్తి.. వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అతడెవరూ? అతని నేపథ్యం ఏంటంటే..

కోట్లా ఆస్తిని వదలి, సుఖవంతమైన జీవితాన్నికాదని గ్రామీణ ప్రాంతం, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికి కోసం జీవితాన్ని త్యాగం చేసేవారు సినిమాల్లో కనిపిస్తుంటారు. పేద ప్రజల అభివృద్ధి కోసం తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సామాన్యుడిగా బతుకుంటారు. అలాంటి వారు  నిజ జీవితంలో చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు అలోక్ సాగర్. మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాకు ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీ ఈ అలక్ సాగర్ ది.

అలోక్ సాగర్ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ డిగ్రీలు చేశాడు. ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారు. ఆయన పేరున వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజన సంక్షేమం కోసం వెళ్లాడు. ప్రజల సేవ పరమావధిగా భావించి సాదాసీదా జీవనం గడుపుతున్నారు ప్రోఫెసర్‌ అలోక్‌ సాగర్‌.

అలోక్‌ సాగర్‌ ఐఐటీ ఢిల్లీ  గ్య్రాడ్యూయేట్‌ తో పాటు ఎన్నో మాస్టర్స్‌ డిగ్రీలను చేశారు. అంతేకాక యూఎస్‌ఏలోని టెక్సాస్‌లో హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం చాలాకాలం ఐఐటీ ఢిల్లీలో మాజీ ప్రోఫెసర్‌గా పనిచేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ వంటి ఎంతో మంది విద్యార్థులను ఆయన పాఠాలు బోధించారు. అలానే ఆయన పేరున కోట్ల ఆస్తి ఉంది. ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఓ రోజు..తన ఉద్యోగానికి రాజీనిమా చేసి, ఆస్తులను అంతస్తులను వదిలి.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలోని కోచాము గ్రామానికి వెళ్లారు. అక్కడే స్థానిక గిరిజనలుతో కలిసి నివశించడం ప్రారంభించారు.

ఆ గ్రామానికి రోడ్డు, కరెంట్ వంటి సదుపాయాలు ఏమీ లేవు. అలాంటి గ్రామానికి వెళ్లి అలోక్ సాగర్ స్థానిక గిరిజనుల మాండలికాన్ని నేర్చుకున్నారు. గిరిజనులు ప్రకృతితో మంచి సంబంధం కలిగి ఉన్నవారని ప్రగాఢంగా నమ్ముమి..వారి జీవన విధానాన్ని అలోక్‌ సాగర్ స్వీగరించారు. గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం వారితోనే జీవనం సాగిస్తున్నారు. ఆయన తల్లి మిరాండా హౌస్‌ డిల్లీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌, తండ్రి ఐఆర్ఎస్ అధికారి, తమ్ముడు ఐఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇలాంటి కుటుంబ నేపథ్యం ఉండి కూడా గిరిజనుల కోసం అని ఓ సాధారణ వ్యక్తిలాగా ఓ పూరింటిలో జీవిస్తున్నాడు. ఇలా జీవిచండం అందరికి అంత ఈజీ కాదు.

నిత్యం గ్రామంలో పనుల నిమిత్తం ఓ సాధారణ సైకిల్ నే వినియోగిస్తారు అలోక్ సాగర్. పర్యావరణం కోసం ఇప్పటి వరకు దాదాపు 50 వేలకు పైగా చెట్లను నాటారు. పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీట్లరు సైకిల్‌పై ‍ప్రయాణించి తీసుకొస్తుంటారు. నేటికాలంలో చాలా మంది డిగ్రీలు, ఆస్తులు సంపాదించి తమ స్టేటస్ ను అందరి ముందు ప్రదర్శించే పనిలో ఉన్నారు. అందరికి భిన్నంగా అలోక్ సాగర్ అత్యంత సాధారణ జీవననాన్ని ఎంచుకున్నారు. ఆయన దాదాపు 78 విభిన్న భాషల్లో అవలీలగా మాట్లాడగలరు. ఆయన చేస్తున్న సేవలు చూసి కొందరు ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నట్లు సందేహ పడ్డారు.  ఆ భయంతోనే ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాలని ఆయనకు ఆదేశించారు.

ఈక్రమంలోనే ఆయన తన వివరాలు చెప్పడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఈయన ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ఇక ఈయన గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్‌ కదూ. ఇలా మరెవ్వరూ చేయరేమో అంటూ అభిమానందలు తెలుపుతున్నారు.గిరిజనుల సంక్షేమం కోసం వచ్చిన రియల్ ‘శ్రీమంతడు’ ‍‍ప్రొఫెసర్‌ అలోక్‌ సాగర్‌ సార్ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ రియల్ శ్రీమంతుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments