P Venkatesh
యూఎస్ లో ఉంటున్న ఓ భారతీయ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చింది. కన్న తల్లిని అనే విషయం మరిచి కొడుకు పట్ల దారుణంగా వ్యవహరించింది. అసలు ఏం జరిగిందంటే?
యూఎస్ లో ఉంటున్న ఓ భారతీయ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చింది. కన్న తల్లిని అనే విషయం మరిచి కొడుకు పట్ల దారుణంగా వ్యవహరించింది. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మను మించిన దైవం లేదని కొనియాడుతారు. బిడ్డల పట్ల అమ్మ చూపే అనురాగం, ప్రేమ మరెక్కడ కూడా లభించదు. నిరంతరం బిడ్డల భవిష్యత్తుకై పరితపిస్తూ తన జీవితాన్ని త్యాగం చేసే ఆదర్శ మూర్తి అమ్మ. తాను పస్తులుండైనా సరే బిడ్డల కడుపు నింపి సంతోష పడేది తల్లి మత్రమే. సమాజంలో ఇంతటి కీర్తి, ప్రతిష్టతలు కలిగిన మాతృమూర్తులు కొందరు కన్న బిడ్డల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. అమ్మతనానికే మచ్చ తెచ్చే విధంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇదే కోవకు చెందిన ఓ తల్లి తన బిడ్డకు అన్నం పెట్టకుండా ఆకలితో అలమటించి చనిపోయేందుకు కారణమైంది. అసలు ఏం జరిగిందంటే?
ఇటీవలి కాలంలో కొంతమంది తల్లులు బిడ్డల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తమ శారీరక సుఖాల కోసం, పరాయి వ్యక్తులపై వ్యామోహంతో సొంత పిల్లలను ఘెరంగా హింసిస్తున్నారు. ప్రియుడితో సరసాలకు పిల్లలు అడ్డొస్తున్నారని ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. కాగా ఇలాంటి రకానికి చెందిన ఓ తల్లి తన పదేళ్ల వయసున్న కొడుకు మరణానికి కారణమైంది. ఆ బాలుడికి అన్నం పెట్టకుండా ఓ పిశాచిలా మారి తన కొడుకు మరణానికి కారణమైంది. ఈ ఘటన యూఎస్ లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన కుటంబంలో చోటుచేసుకుంది.
నార్త్ కరోలినా రాష్ట్రంలోని మోరిస్ విల్లే ప్రాంతంలో నివాస ముంటుంది ఓ భారతీయ ఫ్యామిలీ. కాగా ప్రియాంక తివారీ తన భర్త, పదేళ్ల కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. కొంత కాలం ఆనందంగా సాగిన వీరి జీవితంలో కలహాలు చోటుచేసుకున్నాయి. నిత్యం గొడవలతో భార్య భర్తలు విసిగిపోయారు. దీంతో ప్రియాంక తివారి భర్త ఆమెను బాలుడిని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అయితే బాలుడి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు భారత్ నుంచి కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసిన కూడా ప్రియాంక తివారి స్పందించలేదు. ఈ క్రమంలో ఓ రోజునాడు ప్రియాంక తివారీ 911కు ఫోన్ చేసి తన కొడుకు పరిస్థితి బాగోలేదని చెప్పింది. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు బాలుడిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
అప్పటికే ఆ బాలుడు మృతి చెంది కుల్లిన స్థితిలో బాడీ ఉండడంతో పోలీసులు షాక్ తిన్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు రెండు రోజుల క్రితమే చనిపోయాడని తేల్చి చెప్పారు. బాలుడు చనిపోయేనాటికి చాలా బరువు కోల్పోయాడని నిర్ధారించారు. కన్న తల్లే కొడుకుకు అన్నం పెట్టకుండా ఆకలితో చనిపోయేలా చేసిందని తెలిసి అంతా షాక్ కు గురయ్యారు. కుమారుడి మరణానికి కారణమైన ప్రియాంక తివారినీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరి కన్న తల్లే బిడ్డను ఆకలితో అలమటింప చేసి చనిపోయేందుకు కారణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.