Baby Berths: చంటి బిడ్డలతో ప్రయాణించే తల్లుల కోసం బేబీ బెర్తులు! పరిచయం చేసిన రైల్వేశాఖ

చంటి బిడ్డలతో ప్రయాణించే తల్లుల కోసం బేబీ బెర్తులు! పరిచయం చేసిన రైల్వేశాఖ

Indian Railays Introduced Baby Berths In Trains: నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. వీరిలో యువకులు, పెద్దవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణం చేసే తల్లిదండ్రులు ఉంటారు. అయితే పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో తల్లులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. 

Indian Railays Introduced Baby Berths In Trains: నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. వీరిలో యువకులు, పెద్దవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణం చేసే తల్లిదండ్రులు ఉంటారు. అయితే పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో తల్లులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. 

నిత్యం కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేవారు కూడా ఉంటారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ తీయలేరు. అలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో చిన్న పిల్లలతో ప్రయాణం చేసే వారికి ప్రయోజనం చేకూరనుంది. ఆసియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా ఉన్న భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. రైలు బోగీల్లో బేబీ బెర్తులను అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా అని బీజేపీ ఎంపీ సమర్ సింగ్ సోలంకి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని ప్రశ్నించారు.

దానికి మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిస్తూ.. ఇప్పటికే లఖ్ నవూ మెయిల్ లో ఒక బోగీలో రెండు బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చామని అన్నారు. ఒక బోగీలో రెండు కింది బెర్తులకి బేబీ బెర్తులను అమర్చామని అన్నారు. ఈ కొత్త సౌకర్యంతో ప్రయాణికుల నంచి మంచి స్పందన వచ్చిందని.. అయితే లగేజ్ పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య గ్యాప్ తగ్గడం వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ప్యాసింజర్ బోగీల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయని.. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బేబీ బెర్తులనేవి పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి. పిల్లలతో చాలా మంది తల్లిదండ్రులు రైళ్లలో దూర ప్రయాణాలు చేస్తుంటారు.

కింద పడిపోతారని.. లేదా ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అన్న భయం కారణంగా చిన్న వయసు పిల్లల కోసం ప్రత్యేకంగా బెర్తు బుక్ చేయలేరు. దీంతో పిల్లల్ని తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. దీని వల్ల సీటు సరిపోదు. నిద్ర సరిగా పట్టదు. తల్లి లేదా తండ్రికి, పిల్లలకి ఇరువురికీ ఇబ్బందే. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే బేబీ బెర్తుని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా తల్లి లేదా తండ్రి తమ పాప లేదా బాబుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రధాన బెర్తుకి ఉన్న బేబీ బెర్తుని పైకి ఎత్తి పిల్లలను దాని మీద పడుకోబెట్టుకోవచ్చు. అవసరం లేనప్పుడు దాన్ని కిందికి మడత పట్టేయవచ్చు. చిన్న పిల్లలను ముఖ్యంగా శిశువును సురక్షితంగా పడుకోబెట్టడానికి ఈ బేబీ బెర్తులు ఉపయోగపడతాయి. త్వరలోనే అన్ని రైళ్లలో ఈ బేబీ బెర్తులను చూడవచ్చునన్నమాట.

Show comments