P Venkatesh
Indian Army Portable Hospital: భారత ఆర్మీ మరోసారి తన ఘనతను చాటుకుంది. ప్రజల ప్రాణాలను కాపేడేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ను తయారు చేశారు.
Indian Army Portable Hospital: భారత ఆర్మీ మరోసారి తన ఘనతను చాటుకుంది. ప్రజల ప్రాణాలను కాపేడేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ను తయారు చేశారు.
P Venkatesh
దేశంలో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు వెనకబడిపోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు సరైన వైద్యం అందక అసువులు బాస్తున్నారు. ఆస్పత్రి సదుపాయాలు, మందులు సరైన సమయాల్లో అందలేకపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంబంవించినప్పుడు.. మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో వైద్య సేవలు అందించడం కష్టంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన వినూత్న ఆలోచనకు ప్రతి ఒక్కరు హేట్సాఫ్ చెప్పాల్సిందే. భారత ఆర్మీ, వాయుసేనలు సంయుక్తంగా ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ను రూపొందించారు. దీన్ని విజయవంతంగా ఓ మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు భారత ఆర్మీ, వాయుసేన నడుంబిగించాయి. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలే లక్ష్యంగా రూపొందించిన పోర్టబుల్ హాస్పిటల్ ను.. 15 వేల అడుగుల ఎత్తు నుంచి ఐఏఎఫ్‌కు చెందిన రవాణా విమానం ద్వారా ప్యారాచూట్ సాయంతో జారవిడిచినట్టు రక్షణ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ట్రామా కేర్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్‌లను తరలించారు.
ప్రాజెక్ట్ ‘బీహెచ్‌ఐఎస్‌హెచ్‌ఎం’లో భాగంగా ఈ క్యూబ్‌లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను తరలించేందుకు ఐఏఎఫ్ ఆధునాతన వ్యూహాత్మక సీ-130జే సూపర్ హెర్క్యూలస్ రవాణా విమానాన్ని వినియోగించింది. ఈ ఆపరేషన్‌లో ఆర్మీకి చెందిన పారా బ్రిగేడ్ కీలక పాత్ర పోషించిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ పోర్టబుల్ హాస్పిటల్ సాయంతో మారుమూల, పర్వత ప్రాంతాల్లోని ప్రజలకు ఆపద సమయంలో వైద్య సేవలు అందించడం సులభం అవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.