Dharani
దాయాది దేశ పాకిస్తాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి నీటి సరఫరాను పూర్తిగా ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆవివరాలు..
దాయాది దేశ పాకిస్తాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి నీటి సరఫరాను పూర్తిగా ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆవివరాలు..
Dharani
దాయాది పాకిస్తాన్‌కు భారతదేశం మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సరఫరా అవుతోన్న ఓ నది నీటిని పూర్తిగా ఆపేసింది. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు వెళ్తోన్న రావి నది జలాలను భారత్ పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే.. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం తాజాగా పూర్తయ్యింది. దాంతో ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ తాజా పరిణామంతో రావి జలాలన్నీ మన దేశానికే ఉపయోగపడబోతున్నాయి.
1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్, పాక్ ఇరు దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. దాని ప్రకారం సింధూ నదికి ఉపనది అయిన రావి జలాలపై పూర్తి హక్కులు ఇండియాకే లభించాయి. దీంతో ఈ నది నుంచి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని ఇండియా గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా దీన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై రావి నది నీటిని మొత్తాన్ని భారతే వినియోగించుకోనుంది.
సింధూ జలాల ఒప్పందం ప్రకారం 1979లో పంజాబ్-జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాల మధ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా రావి నదిపై ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యామ్, కింది వైపు షాపుర్ కండీ బ్యారేజ్‌ను నిర్మించాలంటూ అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం షేక్ మహమ్మద్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఒప్పందం చేసుకుని సంతకాలు చేశారు. ఆ తర్వాత 1982లో నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ఈ ప్రాజెక్ట్‌కు శుంఖుస్థాపన చేశారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ 1998 నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ మధ్యలో అనేక అవాంతరాలు రావడంతో.. ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వస్తోంది.
చిట్టచివరకు 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాగా, షాపుర్ కండీ పనులు అనేక ఆటంకాలతో ఆగిపోయాయి. దీంతో పాక్‌కు నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. అయితే, 2008లో షాపుర్ కండీ బ్యారేజీని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. 2013లో నిర్మాణ పనులు ఆరంభించారు. కానీ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌ల మధ్య విభేదాలతో ఏడాదికే మళ్లీ ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. దాంతో చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం చేయడంతో షాపుర్ కండీ బ్యారేజీ నిర్మాణం తిరిగి మొదలైంది.
ఎట్టకేలకు ఈ ఏడాదికి ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో ఫిబ్రవరి 25 నుంచి నుంచి పాకిస్తాన్‌కు రావి నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో 55.5 మీటర్ల ఎత్తైన షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో.. ఇన్నాళ్ల పాటు పాక్‌కు వెళ్లిన నీటిని ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లీస్తున్నారు. దీని వల్ల 32 వేల హెక్టార్లకు సాగు నీరు అందివ్వనున్నారు. అలానే ఈ డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో జమ్మూకశ్మీర్‌కు 20 శాతం వాటా ఇవ్వనున్నారు.
ఇక 1960 భారత్, పాకిస్తాన్ రెండు దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సింధూ, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కగా.. రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు దక్కాయి. అప్పటి ఇండియా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందం మీద సంతకం చేశారు.