భర్తలను వదిలేసి.. లవర్స్ తో పారిపోయిన 11 మంది భార్యలు!

కేంద్రం ఇంటి నిర్మాణం కోసం నిధులు ఇస్తే.. కొందరు మహిళలు వాటిని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఖాతాలో డబ్బులు పడగానే.. భర్తలను వదిలేసి లవర్స్‌తో పారిపోయారు. ఆ వింత ఘటన వివరాలు..

కేంద్రం ఇంటి నిర్మాణం కోసం నిధులు ఇస్తే.. కొందరు మహిళలు వాటిని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఖాతాలో డబ్బులు పడగానే.. భర్తలను వదిలేసి లవర్స్‌తో పారిపోయారు. ఆ వింత ఘటన వివరాలు..

ఆడవారి రక్షణ కోసం.. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేక పథకాలను తీసుకొస్తుంది. అలానే చాలా పథకాల్లో మహిళలే ప్రధాన లబ్ధిదారులుగా ఉంటున్నారు. ఇక హౌజింగ్‌ స్కీమ్‌లో అయితే.. ఆడవారి పేరు మీదనే ఇంటిని రిజిస్టర్‌ చేయిస్తారు. అయితే ప్రభుత్వ పథకాలు, చట్టాలను కొందరు తప్పుడు పనుల కోసం వాడుకుంటున్నారు. తాజాగా ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం.. నిధులు మంజూరు చేస్తే.. ఆ మొత్తాన్ని తీసుకుని.. చక్కా భర్తలను వదిలి లవర్స్‌తో పారిపోయారు కొందరు మహిళలు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వివారలు..

కేంద్ర ప్రభుత్వం పేదింటి కల సాకారం కోసం ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌లో భాగంగా విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు. ఇలా మొదటి విడత డబ్బులు ఖాతాలో పడగానే.. కొందరు మహిళలు భర్తలను వదిలి.. లవర్స్‌తో పారిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌, మహారాజ్‌గంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా కొన్నాళ్ల క్రితం జిల్లాలోని మొత్తం 2,350 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యాయి. ఈ క్రమంలో మొదటి విడతలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో 40 వేల రూపాయలు జమ చేశారు అధికారులు.

ఈ నిధులు ఖాతాలో పడగానే.. జిల్లాకు చెందిన తుతిబరి, షీత్లాపూర్, చాటియా, రాంనగర్, బకుల్ దిహా, ఖాస్రా, కిషూన్‌పూర్, మేధౌలీ గ్రామాలకు చెందిన కొందరు లబ్ధిదారులైన మహిళలు.. ఆ మొత్తం తీసుకుని భర్తలను వదిలి లవర్స్‌తో పరారయ్యారు. వీరిలో ఓ నలుగురి మహిళల ఖాతాలో 50 వేల రూపాయలు కూడా జమ అయ్యాయట. దాంతో సదరు మహిళల భర్తలు లబోదిబోమంటూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇక ఇంటి నిర్మాణం ఎంత వరకు వచ్చిందో పరిశీలించే నిమిత్తం అధికారులు తనిఖీల కోసం రాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో అధికారులు.. సదరు మహిళలకు రెండో విడత నిధులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఇంగ్లీష్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రభుత్వ పథకాలను ఇలా కూడా వాడుకుంటారా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇక పీఎంఏవై పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం 2.50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. కుటుంబ ఆదాయాలకు అనుగుణంగా.. కేంద్రం అందించే సాయంలో వ్యత్యాసం ఉంటుంది. ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంలో ఏవైనా సమస్యలు తలెత్తినా.. అవకతవకలు జరిగినట్లు గుర్తించినా సరే.. అధికారులు వారి నుంచి ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తున్నారు. మరి ఈ మహిళలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అంటున్నారు.

Show comments