iDreamPost
android-app
ios-app

Heavy Rains: గంటలోనే 13 సెంమీ వర్షం.. రెడ్‌ అలర్ట్‌.. నేడు స్కూళ్లకు సెలవు

  • Published Aug 01, 2024 | 8:08 AM Updated Updated Aug 01, 2024 | 8:08 AM

IMD Red Alert To Delhi-School Holiday: గంటలోనే భారీ వర్షం కురిసింది. ఏకంగా 13 సెంమీ వర్షపాతం నమోదయ్యింది. దాంతో ప్రభుత్వం నేడు పాఠశాలలకు హాలీడే ప్రకటించింది. ఆ వివరాలు..

IMD Red Alert To Delhi-School Holiday: గంటలోనే భారీ వర్షం కురిసింది. ఏకంగా 13 సెంమీ వర్షపాతం నమోదయ్యింది. దాంతో ప్రభుత్వం నేడు పాఠశాలలకు హాలీడే ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Aug 01, 2024 | 8:08 AMUpdated Aug 01, 2024 | 8:08 AM
Heavy Rains: గంటలోనే 13 సెంమీ వర్షం.. రెడ్‌ అలర్ట్‌.. నేడు స్కూళ్లకు సెలవు

దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఇక కేరళ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలకు కాస్త ‍బ్రేక్‌ పడింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాక జన జీవితం అస్తవ్యస్తం అవుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక ఢిల్లీలో భారీ వర్షాలు, వరదలు.. ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా గంటలోనే ఏకంగా 13 సెంమీ వర్షపాతం నమోదు కావడంతో.. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఆ వివరాలు..

దేశ రాజధాని నగరం ఢిల్లీని నిన్న అనగా బుధవారం సాయంత్రం వరుణుడు వణికించాడు. కేవలం గంటలోనే దాదాపు 13 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. గురువారం కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ.. రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఇక, బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో గంట వ్యవధిలోనే సుమారు 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Rains in delhi

ఇక గురువారం కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తంగా నేడు అనగా ఆగస్టు 1, గురువారం నాడు.. విద్యా సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతీషి ట్వీట్ చేశారు. మరోవైపు, రావూస్‌ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజేందర్‌నగర్‌లో విద్యార్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. అక్కడ అనేక కోచింగ్‌ సెంటర్లలోకి వర్షం నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరిస్థితిని సమీక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అలర్ట్‌గా ఉండి.. ప్రజల సాధారణ కార్యకలాపాలకు అసౌకర్యం కలగకుండా చూడటమే కాకుండా, కోచింగ్ సెంటర్‌లతో సహా ముంపు ఉండే ప్రదేశాల్లో సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని వారికి సూచించాం’’ అని సక్సేనా సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.