IIT బాంబే విద్యార్థికి రికార్డ్.. రూ.3.7 కోట్ల వేతన ప్యాకేజీ!

విద్యార్థుల క్యాంపస్ ప్లేస్ మెంట్లు, వారికిచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీలు రికార్డులు సృష్టిస్తుంటాయి. అలానే ఏటా తమ రికార్డులను తామే తిరగరాస్తుంటాయి. ఈ సారి కూడా అదే జరిగింది.

విద్యార్థుల క్యాంపస్ ప్లేస్ మెంట్లు, వారికిచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీలు రికార్డులు సృష్టిస్తుంటాయి. అలానే ఏటా తమ రికార్డులను తామే తిరగరాస్తుంటాయి. ఈ సారి కూడా అదే జరిగింది.

విద్యార్థుల క్యాంపస్ ప్లేస్ మెంట్లు, వారికిచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీలు రికార్డులు సృష్టిస్తుంటాయి. అలానే ఏటా తమ రికార్డులను తామే తిరగరాస్తుంటాయి. ఈ సారి కూడా అదే జరిగింది. ఐఐటీ బాంబేలోని విద్యార్థుల్లో ఒకరికి ఓ విదేశీ కంపెనీ నుంచి రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఇదే విషయాన్ని ఐఐటీ బాంబేనే ఓ ప్రకటనలో వెల్లడించింది. అలానే మరో విద్యార్థికి ఓ దేశీయ కంపెనీ రూ.1.7 కోట్ల ప్యాకేజీ ఇవ్వజూపింది. ఈ రెండు అవకాశాలను ఆ విద్యార్థులు అంగీకరించినట్లు ఐఐటీ బాంబే పేర్కొంది.  అయితే ప్లేస్ మెంట్ పొందిన ఆ విద్యార్థుల పేర్లను మాత్రం సంస్థ బయటకు వెల్లడించలేదు. గతేడాది కూడా ఐఐటీ బాంబే విద్యార్థికి ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి రూ.2.1 కోట్ల ప్యాకేజీ లభించింది.

ఐఐటీ బాంబేలో ఇటీవల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు జరిగాయి. ఈ వార్షిక ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్ధులు సత్తా చాటారు. ఎంతో మంది విద్యార్థులు ఈ ప్లేస్ మెంట్ డ్రైవ్ లో పాల్గొన్ని.. భారీ వేతనలతో కూడి ప్యాకేజీ పొందారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐఐటీ విద్యార్థులు తమ రికార్డును తామే తిరగ రాశారు. గతేడాది రూ.2.1 కోట్లతో ఐఐటీ బాంబే విద్యార్థి వార్షిక వేతనం పొందారు. తాజాగా రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఓ విద్యార్ధి అంతర్జాతీయ ఉద్యోగ అవకాశం దక్కింది.

ఇదే విషయాన్ని స్వయంగా ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో వెల్లడించింది. మరో విదేశీ సంస్థ నుంచి మరో విద్యార్థిని రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. ఈ రెండు ఆఫర్‌లను విద్యార్ధులు కూడా అంగీకరించినట్లు ఐఐటీ బాంబే తన ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ఆఫర్లు పొందిన విద్యార్థుల పేర్లను మాత్రం ఇన్‌స్టిట్యూట్ బహిర్గతం చేయలేదు. ఇక మిగిలిన ప్లేస్ మెంట్ వివరాల గురించి చూసినట్లు అయితే.. రూ. కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనాలతో దాదాపు 16 మంది విద్యార్థులు ఉద్యోగ ఆఫర్లు పొందారు.

అలానే 2022-23 ప్లేస్‌మెంట్‌లలో 300 ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌లలో 194 జాబ్స్‌ ఐఐటీ బాంబే విద్యార్ధులకు దక్కించుకున్నారు. జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో 2,174 మంది విద్యార్థులు నమోదు చేసుకుని 1,845 మంది ప్లేస్‌మెంట్‌లలో పాల్గొన్నారు. ఇక ఐఐటీ బాంబే విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, తైవాన్‌లలో దాదాపు 65 విదేశాల్లో జాబ్‌ ఆఫర్‌లను అందుకున్నారు. మరి..ఇలా భారీ వేతనాలతో ఐఐటీ విద్యార్థులు రికార్డులు సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments