iDreamPost

AP రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్..! AIIB బృందం కితాబు..

AP రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్..! AIIB బృందం కితాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పరిపాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని జోడెద్దుల పరుగులు పెట్టిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు..విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవలే ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితి వేదికపై మెరిసిన సంగతి తెలిసిందే. ఇలా కేవలం విద్యారంగంలోనే కాకుండా, వైద్య, ఇతర రంగాల్లో సీఎం జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) బృందం ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై  సంతృప్తిని వ్యక్తం చేసింది.

ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ సహాయంతో ఏపీ ప్రభుత్వం రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులను చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతో పాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏఐఐబీ రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ఈ ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. ఏఐఐబీ ఇంప్లిమెంటేషన్ సపోర్టు  మిషన్ బృందం 5 రోజుల పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఈ రూరల్ రోడ్డు ప్రాజెక్ట్ పనులు బాగా ఉన్నాయంటూ ప్రశంసించింది.

అంతేకాక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. జిల్లా స్థాయి పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమై.. ప్రాజెక్టు పనుల ప్రగతి, నాణ్యతను పరిశీలించింది. అనంతరం మంగళవారం విజయవడాలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో  సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో  జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు ప్రగతిని వివరించి  పనులపై సంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాక తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న రూరల్ రోడ్ల పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా ప్రశంసించింది. మరి..రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఐబీ ఇచ్చిన కితాబుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి