iDreamPost
android-app
ios-app

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 12 మంది దుర్మరణం

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 12 మంది దుర్మరణం

బాణసంచా ఫ్యాక్టరీలల్లో పేలుడు, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుని విపరీతమైన ధన, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. బాణసంచా తయారీ కేంద్ర నిర్వాహకుల నిర్లక్ష్యంతో అమాయకులు బలైపోతున్నారు. కర్మాగారాల్లో సరియైన రక్షణ చర్యలు చేపట్టకుండా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో భారీ పేలుడు సంబవించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 12 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అత్తిపల్లిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తిపల్లిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 12 మంది మృతి చెందారు. పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతం అంతా అగ్నికీలలు ఎగిసి పడి దట్టమైన పొగ అలుముకుంది. మంటలు భారీగా చెలరేగడంతో పక్కనున్న మరికొన్ని షాప్స్ దగ్దమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కొన్ని వాహనాలు సైతం కాలి బూడిదైనట్లు అధికారులు తెలుపుతున్నారు.

ప్రధాన రహదారికి అనుకుని గోదాం ఉండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా ఉలికిపడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి