వీడియో: వీధుల్లోకి వచ్చి.. జనాలను భయపెట్టిన భారీ మొసలి!

Crocodile: ఇటీవల కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిలో ఉండాల్సిన మొసళ్లు..గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.తాజాగా ఓ భారీ మొసలి గ్రామంలో హల్ చల్ చేసింది.

Crocodile: ఇటీవల కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిలో ఉండాల్సిన మొసళ్లు..గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.తాజాగా ఓ భారీ మొసలి గ్రామంలో హల్ చల్ చేసింది.

నేటికాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడా ఏ చిన్న విషయం జరిగిన క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతుంది. నిత్యం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,  వాట్సాప్, ట్విట్టర్ వంటి అనేక సోషల్ మీడియా మాద్యమాల్లో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి.  కొన్ని ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని కామెడీగా ఉంటాయి. మరికొన్ని దృశ్యాలు భయకరంగా ఉంటాయి.  తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నదుల్లో, జలశయాల్లో ఉండాల్సిన మొసలి.. వీధుల్లోకి వచ్చింది. అంతేకాక జనాలను భయాందోళనకు గురి చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇదే సమయంలో జలాశయాలు నిండుకుండాల్లా కనిపిస్తున్నాయి. ఇక ఇటీవల కురిసిన భారీ వానల ధాటికి పలు ప్రాంతాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ముఖ్యంగా కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అయితే ఈ తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేరళలోని వయనాడ్ లో కనీవినీ ఎరుగుని ప్రకృతి విలయం సంభవించింది. వందలామంది మంది చనిపోగా..మరెందరో గల్లంతయ్యారు. అలానే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొండచరియలు విరిగి పడి… పలు గ్రామాలు ధ్వంసమయ్యాయి. ఇది ఇలా ఉంటే వరదల కారణంగా పలు గ్రామాల్లో విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రంలో బిజ్నోర్ జిల్లాలో మొసలి హల్ చల్ చేసింది.  బిజ్నోర్ జిల్లాలోని నంగల్ సోతి గ్రామంలోకి మొసలి ఒకటి వచ్చింది. వరదల కారణంగా నీటి ప్రవాహంలో కొట్టుకుని ఆ గ్రామంలోకి వచ్చింది. భారీగా ఉన్న ఆ  మొసలిని  చూసి… గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో కొందరు ఆ మొసలి వెంటపడి..దానిని కాలితో తనడం చేశారు. వీధుల్లో చాలా సేపు పరుగులు తీస్తూ ఆ మొసలి హల్ చల్ చేసింది. అది వీధుల్లో పరుగులు తీస్తుండటంతో గ్రామాస్తులు భయంతో ఇళ్లల్లో దాక్కున్నారు.  అలా చాలాసేపు వీధిలో తిరిగిన ఆ మొసలి… చివరకు నీళ్లు ఉన్న ఓ మురికి కాలువలోకి దిగింది. అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న అధికారులు  మొసలి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments