Arjun Suravaram
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా ఫేమస్ అయిన వ్యక్తి గురించి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా ఫేమస్ అయిన వ్యక్తి గురించి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Arjun Suravaram
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ప్రాంతంలో ఘోరమైన ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. దైవ భక్తితో సత్సంగ్ కోసం వెళ్తే.. తొక్కిసలాట జరిగి 120 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మందికి తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. కేవలం 5 వేల మంది పట్టే ప్రాంతంలో దాదాపు 2లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించడంతో ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్రాస్ లో భోలే బాబా అనే ఆధ్యాత్మిక గురువు మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తీవ్ర విషాదం జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఇక ఇంతమంది చావులకు కారణమైన భోలే బాబా కథలో విస్తుతపోయే వాస్తవా వెలుగులోకి వస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా ఫేమస్ అయిన వ్యక్తి గురించి పోలీసులు విచారణ చేపట్టారు. భోలేబాబా అసలు పేరు.. నారాయణ్ సాకార్ హరి అలియాస్ సాకార్ విశ్వహరి అని పోలీసులు నిర్ధారించారు. ఈయన ఆశ్రమంకు వచ్చే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన చరిత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. విచారణలో భోలే బాబాపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పోలీస్ విభాగంలో నారాయణ్ సాకార్ హరి పనిచేశాడు. ఆ సమయంలో కొందరు మహిళపై లైంగిక వేధింపులు పాల్పడి ఘటనలో అరెస్టై జైలు పాలయ్యాడు.
భోలే బాబాపై ఆగ్రా, ఎటావా, కస్గంజ్, ఫరూఖాబాద్, రాజస్థాన్‌తో సహా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. 1997లో అరెస్టయి కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. లైంగిక వేధింపుల కేసులో జైలు తరువాత బయటకు వచ్చి.. తన పేరును సాకార్ విశ్వహరి బాబా గా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరిచాడు. తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రజలకు చెబుతుంటాడు. ఇక ఈ భోలే బాబాకు దేశ వ్యాప్తంగా లక్షల మంది అనుచరుల ఉన్నారు. ఇతడి కార్యక్రమాలను నిర్వహించే వారు నల్లటి దుస్తులు ధరించి విధులు నిర్వహిస్తారు.
ఆ ఆశ్రమంలో పనిచే వీరందరని సేవాదర్ ఆర్మీగా పిలుస్తుంటారు. అలా స్థానికంగా భోలే బాబా ప్రసిద్ధి చెందారు. మంగళవారం సత్సంగ్ పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిస లాట జరిగి 121 మంది మరణించగా.. వంద మందికిపైగా తీవ్రగాయలయ్యా. హత్రాస్‌లో జరిగిన ఈ సంఘటన, భోలేబాబా పాద దూళి కోసం ఎగబడటం, ఆయన ఆశిస్సులు తీసుకునేందుకు పోటి పడడం విషాదానికి కారణమైంది. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సంఘటన స్థలాన్ని చేరి..పరిశీలించారు.