Venkateswarlu
Venkateswarlu
ఆయనో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సమస్యలను వింటూ ఉన్నారు. వాటికి తగ్గట్టు సమాధానాలు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ఆయనతో తన కష్టాన్ని చెప్పుకుంది. తనకు ఉద్యోగం ఇప్పించమని అడిగింది. ఆ ప్రశ్నకు ముఖ్యమంత్రి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఉద్యోగం ఇస్తాననో.. ఇవ్వను అనో కాకుండా.. ఆమెతో వెటకారంగా మాట్లాడాడు. చంద్రయాన్ 4లో ఆమెను చంద్రుడిపైకి పంపుతానంటూ వెకిలిగా నవ్వాడు.
ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఏకంగా హర్యానా ముఖ్యమంత్రే మహిళతో వెటకారంగా మాట్లాడాడు. ఆ వివరాల్లోకి వెళితే.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కొద్దిరోజుల క్రితం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఈ సందర్భంగా వారు తమ కష్టాలను ముఖ్యమంత్రికి చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ‘ మేము ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఓ ఫ్యాక్టరీ ఏదైనా కట్టిస్తే.. ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి దొరుకుతుంది’ అని అంది.
మహిళ అడిగిన దానికి ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ.. ‘‘ ఈసారి చంద్రయాన్ 4ను చంద్రుడిపైకి పంపిస్తారు కదా!.. అందులో నిన్ను చంద్రుడిపైకి పంపిద్దాం. సరే కూర్చో ఇక’’ అంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఉద్యోగం అడిగిన మహిళతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ వెటకారాలు ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।”
धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं।
महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी
यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt
— AAP (@AamAadmiParty) September 7, 2023