iDreamPost
android-app
ios-app

వీడియో: సాయం కోసం వచ్చిన యువకుడు.. తన ముందు మోకరిల్లాలన్న ప్రభుత్వ అధికారి!

వీడియో: సాయం కోసం వచ్చిన యువకుడు.. తన ముందు మోకరిల్లాలన్న ప్రభుత్వ అధికారి!

దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తుంటే కొందరు వ్యక్తులు మాత్రం అనాగరిక పరిస్థితులను మళ్లీ కళ్ల ముందు ఉంచుతున్నారు. చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. సమాజం పట్ల అవగాహన ఉన్న ఓ ప్రభుత్వ అధికారి ఓ యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించాడు. సాయం కోరి వచ్చిన ఆ యువకుడి పట్ల మానవత్వం మరిచి ప్రవర్తించాడు ఆ అధికారి. ఇక దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. దీనిపట్ల స్పందించిన ఉన్నతాధికారులు ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సామాన్య ప్రజల పట్ల అధికారులు వ్యవహరించే తీరు పట్ల మండిపడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ యువకుడు అధికారి ముందు మోకరిల్లాల్సి వచ్చిది? ఆ వివరాలు మీ కోసం..

యూపీలో ఓ యువకుడు తమ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని ఓ అధికారిని విన్నవించుకున్నాడు. కానీ ఆ అధికారి మాత్రం తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన బరేలీ జిల్లాలోని మీర్‌గంజ్ పట్టణానికి చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మందన్ పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆ ఊరి గ్రామస్తులతో కలిసి తమ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించడానికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీస్ కు చేరుకున్నాడు. తమ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారి అయిన ఎస్డీఎమ్ ఉదిత్ పవార్ కు వినతి పత్రాన్ని అందించాడు. వినతి పత్రాన్ని తీసుకున్న ఉదిత్ పవార్ విసిరి పారేసాడని, తన ముందు మోకరిల్లాలని అన్నట్లు బాధిత యువకుడు తెలిపాడు. దీంతో చేసేదేం లేక అధికారి ముందు వంగి మోకరిల్లాలని ఆ యువకుడు ఆరోపించాడు.

కాగా ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను ఎస్డీఎమ్ ఉదిత్ పవార్ తోసి పుచ్చారు. తను ఆఫీస్ కు వచ్చేసరికి తన చాంబర్ లో వంగి ఉన్నాడని, ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే సాయం చేయమని వేడుకుంటున్నట్లు బాధిత యువకుడు చెప్పినట్లు ఉదిత్ పవార్ వెల్లడించాడు. ఇక ఈ వ్యవహారంపై ఆరా తీసిన బరేలీ జిల్లా మెజీస్ట్రేట్ శివకాంత్ ద్వివేది, ఉదిత్ పవార్ కార్యాలయంలో చేటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను తాను చూశానని, యువకుడిని అవమానించడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపాడు. అతడిని డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేసినట్లు బరేలీ డీఎమ్ వెల్లడించాడు. ఈ ఘటనతో ప్రభుత్వ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి