బీర్ ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. రోజూ తాగితే మంచిదట

ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పినా, ఆమెకు మరొకరితో పెళ్లైనా, ఇంట్లో భార్యతో గొడవలైనా, ఆఫీసులో బాసుతో అక్షింతలు వేయించుకున్నా.. మనస్సు బాగోలేదన్న కారణం చెప్పి సాయంత్రం మద్యం షాపుల వద్దకు వెళ్లిపోతుంటారు పరుష పుంగవులు. కొంత మంది నిత్యం తాగి ఒళ్లు, ఇల్లు గుళ్ల చేసుకుంటారు. మరికొంత మంది నియమంగా వీకెండ్స్‌లో తాగుతూ ఫుల్ జోష్ అవుతుంటారు. పోనీ తాగి ఊరుకుంటారా.. రోడ్ల మీద రచ్చ రచ్చ చేసేవాళ్లు కొందరైతే.. ఇంటికి వెళ్లి నానా యాగీ చేసేవారు కొందరు. దీంతో వీరందరినీ తాగుబోతులన్నా ముద్ర సమాజం వేస్తుంది. అయితే రోజూ తాగితే కచ్చితంగా శరీర అవయవాలు పాడై.. త్వరగా చచ్చిపోతారు. అలాగే ఒకసారి అలవాటు పడిన ప్రాణం ఆపేమద్దామనుకున్న ఆపేయలేని పరిస్థితి. అందుకే ఉన్న పళంగా కూడా తాగుడు మానడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

మద్యం రకాల్లో చాలా ఉన్నా.. ఎక్కువ మంది వినియోగించే టానిక్ బీర్. మూతి మీద మీసాలు వచ్చిన కుర్రాడి నుండి ముసలి వాడి వరకు దీన్నే ఎక్కువ తాగుతూ ఉంటారు. చీల్డ్ బీర్ తాగుతూ చిల్ అవుతుంటారు. పార్టీలైనా, ఫంక్షనైనా, స్నేహితులతో చిట్ చాట్ అయినా బీర్ ఉండాల్సిందే. అయితే ఇది కూడా శరీరానికి హాని చేస్తుంది. కానీ బీర్ వల్ల కూడా లాభాలున్నాయంటోంది ఓ సర్వే. బీర్ ప్రియులకు చల్లటి వార్తను చెవిలో వేసింది. అదేంటంటే.. రోజు బీర్ తాగితే మంచిదట. ఇంతకు ఆ విషయం ఏ సర్వేలో తేలిందంటే.. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ చేపట్టిన దానిలో. ఏడు వేల మందిపై చేపట్టిన ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. గుండె సమస్యలు ఉన్న వారు రోజుకు ఒకటిన్నర నుండి రెండు గ్లాసుల వరకు బీర్ తీసుకుంటే గుండెపోటు సమస్యలు దరిచేరవని తేలింది.

అంతేనా.. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడవట. బీర్లతో యాంటీ ఆక్సిండెట్లు ఉండటం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చనని పేర్కొంది. అలాగే విటమిన్ బి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయట. వారానికి దాదాపు 14 గ్లాసుల బీర్ తాగితే.. షుగర్ బారిన పడరట. పాలల్లో ఎముకల బలానికి తోడ్పడే కాల్షియం .. బీర్‌లో కూడా ఉంటుందని సర్వేలో తేలింది. అలాగే నోటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చునట. నోటిలో ఏవైనా ఇన్ ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాలు.. ఈ బీర్ కారణంగా అంతరించిపోతాయట. ఇంతలా చెబుతున్నారు కాబట్టి.. ఈ రోజు నుండే బీర్ బాటిల్ ఎత్తేద్దామనుకుంటున్నారేమో.. అయితే అతిగా ఏదీ తీసుకున్న అనర్థం అన్న విషయాన్ని గ్రహించి.. ఆ తర్వాత బీర్ తాగితే బెటర్.

Show comments