వీడియో: కొత్త తరహా దొంగతనం! స్కూల్ డ్రెస్ లో వచ్చి స్కూటీ చోరీ!

Uttar Pradesh: నేటికాలంలో దొంగళ్లు కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. జనాలకు ఏమాత్రం అనుమానం రాని విధంగా ఇలా స్కూల్ పిల్లలు, భక్తులు, ముసలి వాళ్లు వంటి వివిధ రూపల్లో చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

Uttar Pradesh: నేటికాలంలో దొంగళ్లు కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. జనాలకు ఏమాత్రం అనుమానం రాని విధంగా ఇలా స్కూల్ పిల్లలు, భక్తులు, ముసలి వాళ్లు వంటి వివిధ రూపల్లో చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

నేటికాలంలో ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కేవారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ప్రజల సొమ్మును, వస్తువులను దొంగిలించే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. ఇళ్లు, షాపులు, బ్యాంకులు వంటి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దొంగతలు కొత్త పంథాలో  చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని దొంగతనాలను చూస్తే..మాత్రం ఆశ్చర్యపడమానము. మన ముందే మన వస్తువులను చాకచక్యంగా కొట్టేసి అక్కడి నుంచి జారుకుంటున్నారు. తాజాగా ఓ కొత్త తరహా చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ దొంగ ఎంతో తెలివిగా దొంగతనం చేసింది. అది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి ప్రాంతలో కొత్త తరహా దొంగతనం చోటుచేసుకుంది. ఓ యువతి స్కూల్ యూనిఫామ్ డ్రెస్ లో వచ్చి…స్కూటీని చొరీ చేసింది. వారణాసి పట్టణంలోని కబీర్ నగర్ ప్రాంతంలో ఈ చోరీ చోటుచేసుకుంది. అయితే ఆ యువతి దొంగతనం చేసిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చక్కగా స్కూల్ యూనిఫామ్, బ్యాగ్ ధరించి కబీర్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ వద్దకు వచ్చింది. అక్కడే ఓ స్కూటీ ఉండటాని గమనించింది. ఆ స్కూటీ యజమాని అయిన ఓ మహిళ వద్దకు యువతి వెళ్లింది.  బైక్ కు దారికి అడ్డంగా ఉందని, కీ ఇస్తే పక్కకు తీస్తాను అని ఆ యువతి చెప్పింది. దీంతో ఆమె మాటలు నమ్మి..ఆ స్కూటీ ఓనర్..కీ ఇచ్చింది. ఇక బైక్ కీ తీసుకున్న సదరు యువతి..కిందకు చేరుకుంది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న స్కూటీని పక్కకు తీస్తున్నట్లు ఆ యువతి కాసేపు యాక్ట్ చేసింది. ఇక ఆ బండిని పూర్తిగా బయటకు తీసుకొచ్చింది. అనంతరం చక్కగా ఆ స్కూటీని నడుపుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. కాసేపటి తరువాత బాధితురాలు వచ్చి చూడగా..స్కూటీ కనిపించలేదు. దీంతో తన  స్కూటీ చోరీకి గురైనట్లు బాధితురాలు గుర్తించింది. ఇద ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్కూల్ యూనిఫామ్ లో యువతి వచ్చి..ఆ విధంగా చోరీ చేయడంపై స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఇక బాధిత మహిళ..స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తంగా దొంగళ్లు కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. జనాలకు ఏమాత్రం అనుమానం రాని విధంగా ఇలా స్కూల్ పిల్లలు, భక్తులు, ముసలి వాళ్లు వంటి వివిధ రూపల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో జరిగిన చోరీలందూ..ఈ చోరీ వేరయ్యా అంటూ ఫన్నీ కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా విలువైన వస్తువులను కోల్పోతారని చెబుతున్నారు. మరి.. ఈ కొత్త తరహా దొంగతనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments